Mega Family: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... కొత్త కోడలు లావణ్య ఎంట్రీతో మళ్లీ ఒక్కటి కాబోతున్న ఆ జంట!
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్. ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు.. ఆ తర్వాత మనస్పర్థాలు రావడంతో.. విడిపోతుంటారు. సమంత నాగచైతన్య, ధనుష్ ఐశ్వర్య రాజేష్, అమలా పాల్ ఇలా చాలా మంది సెలబ్రేటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక కొంత మంది విడిపోయినా కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకుండా సైలెంట్ గా ఉండిపోతారు.
ఎందుకు బయట ప్రచారమని అనుకుంటూ ఉంటారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీలో ఓ జంట మళ్లీ కలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మెగా కోడలు వచ్చిన వేళా విశేషం.. మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఎవరు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ప్రేమ పెళ్లిళ్లు సర్వ సాధారణమని తెలిసిందే. సమంత దైర్యం చేసి.. నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తర్వాత చాలా మంది సెలబ్రెటీలు తమ ఫ్యామిలీ లైఫ్ కు బ్రేకప్ చెప్పుకున్నారు. రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య తన భర్త ధనుష్ విడాకులు, అమలా పాల్ తన మొదటి భర్తకు విడాకులు.. బాలీవుడ్ లోనూ పలు జంటలు విడిపోయ్యాయి. కారణాలు ఏవైనా సరే.. విడిపోవడం అనేది కుటుంబాలకు బాధగానే ఉంటుంది.
ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఇప్పటికే నిహారిక.. తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. పెద్దలు తెచ్చిన సంబంధం అయినప్పటికీ వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చి విడిపోయారు. విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. నిహారిక, చైతన్య మధ్య ఏవో మనస్పార్థాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక నిహారిక తన లైఫ్ లో తాను బీజీగా మారిపోయింది.. మరోవైపు చైతన్య జోన్నలగడ్డ కూడా తన బిజి లైఫ్ లో ఉండిపోయాడు.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు కూడా తన రెండో భర్త కల్యాణ్ దేవ్ తో చాలా కాలంగా విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీరు డైవర్స్ తీసుకున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ.. విడిగానే ఉంటున్నారు. మొన్న వరుణ్ తేజ్ పెళ్లికి కూడా కల్యాణ్ దేవ్ రాలేదు. ఆయన రెండో మూడో సినిమాలు తీసి... ఆ తర్వాత ఆయన పని అతను చేసుకుంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. కల్యాణ్ దేవ్ శ్రీజ గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.

శ్రీజ మొదటి భర్తతో ఓ సంతానం ఉంది.. కల్యాణ్ దేవ్ తో కూడా కూతురు ఉంది. ఇక ఏ పండగ వచ్చినా.. కూతురిని కల్యాణ్ తీసుకుని వెళ్లి వాళ్లింట్లో టైం స్పెండ్ చేస్తాడు. శ్రీజా మొదటి భర్త కూతురిను కూడా కళ్యాణ్ దేవ్ చాలా బాగానే చూసుకునేవాడు. ఆమెతో కళ్యాణ్ దేవ్ చాలా సందర్భాలలో ఫోటోలను తీసి అభిమానులతో పంచుకునే వాడు. అయితే ఇప్పుడు వీరు వేరు వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.
మళ్లీ శ్రీజ, కల్యాణ్ దేవ్ ఒక్కటి కాబోతున్నారట. దీనికి సంబంధించిన చర్చలు కూడా మెగా ఫ్యామిలీలో నడుస్తున్నాయి. వీరిని కూర్చొబెట్టి.. మళ్లీ ఒక్కటి చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకన్న మెగా ఫ్యాన్స్.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి వచ్చిన వేళా విశేషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త కోడలు వచ్చింది.. మళ్లీ ఈ జంట ఒక్కటి కాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











