For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!

    |

    ఇండస్ట్రీలో శాఖోపశాఖలుగా విస్తరించిన మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు నిర్మాతగా ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఇప్పటికే సినీ పరిశ్రమలో ఉంది. చిరు సినిమాలకు అద్భుతమైన స్టైలింగ్‌ను డిజైన్ చేసి అబ్బుర పరిచింది. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలకు ప్రత్యేకంగా మేకోవర్ చేసిన సుష్మిత అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మరో అవతారమెత్తబోతోంది.

    సక్సెస్ కానీ మెగా హీరోయిన్..

    సక్సెస్ కానీ మెగా హీరోయిన్..

    మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే వచ్చారు. నాగ బాబు కూతురు నిహారిక వచ్చినా.. అద‌ృష్టం మాత్రం కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా ఫలించలేదు. బుల్లితెరపై బాగానే వర్కౌట్ అయినా వెండితెరపై అంతగా వెలగలేకపోయింది. దీంతో ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపైన దృష్టి పెట్టినట్టు సమాచారం.

    స్టైలింగ్‌తో ఆకట్టుకున్న సుష్మిత..

    స్టైలింగ్‌తో ఆకట్టుకున్న సుష్మిత..

    చిరు పెద్ద కూతురు కూడా సినీ రంగంలోనే ఉన్నా.. తెర ముందు కనిపించే పని కాదు. అంతా తెర వెనుకుండి చేసేది. చిరు కోసం ప్రత్యేకమైన డిజైన్లు చేయడం, తన తండ్రిని అందంగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేసేంది. ఆమె పనితనానికి కూడా మంచి గుర్తింపే లభించింది.

     నిర్మాతగా అడుగు..

    నిర్మాతగా అడుగు..

    అయితే ఇదే కాకుండా మరో రంగంలోనూ అడుగు పెట్టాలని ఆలోచిస్తుందంట చిరు పెద్ద కూతురు. నిర్మాతగా మారాలనే ఆలోచన పుట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని కథలను కూడా వింటోందని సమాచారం. అయితే నేరుగా వెండితెరపైకి రాకూడదని అనుకుంటోందని టాక్.

    వెబ్ సిరీస్‌లతో ప్రయత్నం..

    వెబ్ సిరీస్‌లతో ప్రయత్నం..

    ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల మయం కాగా.. అటు వైపుగా ఆలోచనలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా వెబ్ సిరీస్‌లను నిర్మించి.. అక్కడ విజయవంతం అయితే బిగ్ స్క్రీన్‌పై సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమ్ముడు రామ్ చరణ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతుండగా.. అక్క అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

    English summary
    Chiranjeevi Daughter Sushmitha Turns As Producer. Now She Wants to Produce A Web Series. After That She May Produce A Movie On Big Screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X