Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నిర్మాతగా మెగా డాటర్ ఎంట్రీ.. వాటితో మొదలు పెడుతుందంట!
ఇండస్ట్రీలో శాఖోపశాఖలుగా విస్తరించిన మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు నిర్మాతగా ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఇప్పటికే సినీ పరిశ్రమలో ఉంది. చిరు సినిమాలకు అద్భుతమైన స్టైలింగ్‌ను డిజైన్ చేసి అబ్బుర పరిచింది. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలకు ప్రత్యేకంగా మేకోవర్ చేసిన సుష్మిత అందరి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మరో అవతారమెత్తబోతోంది.
సక్సెస్ కానీ మెగా హీరోయిన్..
మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హీరోలే వచ్చారు. నాగ బాబు కూతురు నిహారిక వచ్చినా.. అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా ఫలించలేదు. బుల్లితెరపై బాగానే వర్కౌట్ అయినా వెండితెరపై అంతగా వెలగలేకపోయింది. దీంతో ప్రస్తుతం వెబ్ సిరీస్లపైన దృష్టి పెట్టినట్టు సమాచారం.
స్టైలింగ్‌తో ఆకట్టుకున్న సుష్మిత..
చిరు పెద్ద కూతురు కూడా సినీ రంగంలోనే ఉన్నా.. తెర ముందు కనిపించే పని కాదు. అంతా తెర వెనుకుండి చేసేది. చిరు కోసం ప్రత్యేకమైన డిజైన్లు చేయడం, తన తండ్రిని అందంగా చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేసేంది. ఆమె పనితనానికి కూడా మంచి గుర్తింపే లభించింది.
నిర్మాతగా అడుగు..
అయితే ఇదే కాకుండా మరో రంగంలోనూ అడుగు పెట్టాలని ఆలోచిస్తుందంట చిరు పెద్ద కూతురు. నిర్మాతగా మారాలనే ఆలోచన పుట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని కథలను కూడా వింటోందని సమాచారం. అయితే నేరుగా వెండితెరపైకి రాకూడదని అనుకుంటోందని టాక్.
వెబ్ సిరీస్‌లతో ప్రయత్నం..
ప్రస్తుతం అంతా వెబ్ సిరీస్‌ల మయం కాగా.. అటు వైపుగా ఆలోచనలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటగా వెబ్ సిరీస్‌లను నిర్మించి.. అక్కడ విజయవంతం అయితే బిగ్ స్క్రీన్‌పై సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమ్ముడు రామ్ చరణ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతుండగా.. అక్క అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.