భోళా దెబ్బతో చిరంజీవి యూటర్న్: కొత్త సినిమాపై బిగ్ ట్విస్ట్.. డైరెక్టర్‌కు ఇబ్బందే కానీ తప్పట్లేదట
ఏ ముహూర్తానా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారో కానీ, అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంతోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్న కొత్త ప్రాజెక్టుపై చిరంజీవి యూటర్న్ తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
భోళా శంకర్.. బిగ్ డిజాస్టర్: చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రమే 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా అనుకున్న విధంగా దక్కలేదు. ఫలితంగా భారీ నష్టాలతో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది.

కల్యాణ్ కృష్ణతో చిరంజీవి: రీఎంట్రీలో యమ జోష్‌తో ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 22న ఈ మూవీకి అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
ఆ మూవీకి రీమేక్ అంటూ: 'భోళా శంకర్' డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలోనే సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన 'బ్రో డాడీ'కి రీమేక్‌గా వస్తుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇక ఇందులో చిరంజీవి కుమారుడిగా శర్వానంద్ నటిస్తున్నట్లు కూడా ఇటీవలే ఓ వార్త బయటకు వచ్చేసింది.

చిరంజీవి యూటర్న్ అని: గతంలో కంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ చిత్రాలనే చేస్తున్నారు. అలా వచ్చిన 'భోళా శంకర్' అత్యధిక నష్టాలను ఎదుర్కొని దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి.. కల్యాణ్ కృష్ణ మూవీ విషయంలో యూటర్న్ తీసుకున్నారని తెలిసింది. తాజా సమచారం ప్రకారం.. ఆయన 'బ్రో డాడీ'ని రీమేక్ చేయడం లేదట.

కొత్త సినిమా ట్విస్ట్ ఇచ్చి: 'భోళా శంకర్' ఎఫెక్ట్ నుంచి తేరుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఈ సారి కొత్త కథతోనే రావాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కల్యాణ్ కృష్ణతో ఆయన చెప్పేశారట. దీంతో షాకైన సదరు దర్శకుడు చిరంజీవి కోసం తన దగ్గర ఉన్న కొత్త కథను వినిపించి మెప్పించాడట. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ ఈ స్టోరీని రెడీ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











