చిరంజీవి గ్లామర్ సీక్రెట్ ఫర్ 150 మూవీ..
ఆ మద్యన చిరంజీవి చిత్రానికి బోయపాటి శ్రీనుని దర్శకుడుగా ఎంపిక చేసారని వినపడుతోంది. అలాగే తన కొత్త చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని చిరంజీవి ఇటీవలే చెప్పారు. ఆ కొత్త చిత్రం ఠాగూర్ చిత్రంలా ఉంటుందని, మానవీయ కోణంలోనే ఈ చిత్రం ఉంటుందన్నారు. కాగా చిరంజీవి తన 150వ సినిమా కోసం సన్నబడ్డాడు. చిక్కి సన్నబడిన చిరుని చూసి చాలా మంది 10యేళ్ళు వయసు చిరుకు తగ్గినట్టుందని మాట్లాడుకుంటున్నారు. గ్లామర్ గా కనబడటానికి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. బరువు పెరగకుండా ఉండాలంటే పట్టుదలతో పూర్తిగా మందు కూడా మానేశాడట చిరంజీవి. జిమ్ తో పాటు యోగా కూడా చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ ఫిట్ గా తయారయ్యి తన 150వ సినిమాలో డ్యాన్స్ లతో పాటు ఫైట్స్ కూడా అదరగొట్టాలని చిరు నిర్ణయించుకున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











