God Father: చిరంజీవి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. మలయాళంలో లేకున్నా ఇందులో హైలైట్‌గా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ తనలో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని నిరూపిస్తూ ఆయన వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు చిత్రాలను కూడా ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఏకకాలంలో వరుసగా కొన్ని సినిమాలను లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

లూసీఫర్.. గాడ్ ఫాదర్‌గా మారాడు

లూసీఫర్.. గాడ్ ఫాదర్‌గా మారాడు

సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.

సంబంధం లేకుండా మార్చేశాంటూ

సంబంధం లేకుండా మార్చేశాంటూ

మొదట 'లూసీఫర్' మూవీని.. తెలుగులో రీమేక్ చేసే బాధ్యతలను యంగ్ డైరెక్టర్ సుజిత్ తీసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో అతడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మోహన్ రాజా దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా జత చేశాడు. హీరో పాత్రను కూడా ఎలివేట్ చేసి స్క్రిప్టును పూర్తిగా మార్చేశాడట.

నయన్, సత్యదేవ్.. ఇప్పుడు అను

నయన్, సత్యదేవ్.. ఇప్పుడు అను

రాజకీయ నేపథ్యంలో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో మలయాళంలో మంజు వారియర్ పోషించిన హీరో సోదరి పాత్రను నయనతార చేస్తుందట. అలాగే, ఆమె భర్తగా నటించిన వివేక్ ఒబెరాయ్ రోల్‌ను సత్యదేవ్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడు చిరంజీవి చెల్లెలిగా ప్రముఖ యాంకర్ అనసూయ నటిస్తుందన్న ప్రచారం మొదలైంది. దీంతో అంతా అయోమయంగా మారింది.

సల్మాన్ ఖాన్‌ను కూడా ఒప్పించారు

సల్మాన్ ఖాన్‌ను కూడా ఒప్పించారు

'లూసీఫర్' మూవీలో హీరోకు సహాయం చేసే ఓ డాన్ రోల్ కూడా ఉంటుంది. మలయాళంలో ఆ పాత్రను పృథ్వీ రాజ్ సుకుమారన్ చేశాడు. అయితే, తెలుగులో ఆ రోల్ ఎవరు చేస్తారన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పాత్రకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నారని, ఇందుకు అతడు డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ అంటూ

మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ అంటూ

'గాడ్ ఫాదర్' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేసి.. మరో సినిమా షూట్‌లో పాల్గొనాలని చిరంజీవి పట్టుదలతో ఉన్నారు. అందుకే హైదరాబాద్‌లోనే ఈ మూవీ చిత్రీకరణను పూర్తిగా జరపబోతున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇందులోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Prabhas కి హాట్సాఫ్.. Megastar Chiranjeevi మాస్ హీరో - Harbhajan Singh
మలయాళంలో లేకున్నా హైలైట్‌గా

మలయాళంలో లేకున్నా హైలైట్‌గా

మలయాళంలో లేకున్నా 'గాడ్ ఫాదర్' మూవీలో హీరోయిన్ పాత్రను యాడ్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందట. అంతేకాదు, ఆ సమయంలో ఓ అదిరిపోయే డ్యూయెట్ సాంగ్‌ను కూడా డిజైన్ చేశారని తాజాగా తెలిసింది. దీనితో పాటు గద్దర్ పాడే ఓ పాట సినిమాకు హైలైట్‌గా ఉండబోతుందట. మొత్తానికి ఫ్యాన్స్‌కు ఇవన్నీ సర్‌ప్రైజ్‌లే అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X