'ఆరెంజ్' దర్శకుడు భాస్కర్ పై మండిపడుతున్న చిరంజీవి
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా "ఆరెంజ్" చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో మొన్న(సోమవారం) విడులైంది. ఇక ఈ చిత్రం బడ్జెట్ పెరగటంపై చిరంజీవి మండిపడుతున్నారని తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ ని దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాడని భాస్కర్ ని ఇప్పటికే రెండు మూడు సార్లు కోప్పడ్డారని చెప్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ కాని ఈ చిత్రానికి ఇప్పటివరకూ 35 కోట్ల వరకూ బడ్జెట్ అయింది. ఓ లవ్ స్టోరి కి అంత ఖర్చు పెట్టడం ఎంతవరకూ సబబు అని చిరంజీవి..నాగబాబు ని సైతం నిలదీసారని చెప్తున్నారు.
మొదట ఇరవై కోట్ల లోపే అన్న ఈ చిత్రం ఆ బడ్జెట్ తో సగం కూడా పూర్తి కాకపోవటంతో దర్శకుడుని పిలిచి అప్పుడే కోప్పడితే,రామ్ చరణ్ వారించి డైరక్టర్ మూడ్ ని చెడకొట్టకుండా ఆపాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్లానింగ్ లేకుండా మూడు సార్లు మలేషియా, రెండు సార్లు ఆస్ట్రేలియా వెళ్ళటమే సగం బడ్జెట్ పెరగటానికి కారణమంటున్నారు. అలాగే చాలా సీన్స్ రీషూట్ చేసారని అని వినపడుతోంది. ఇప్పటికీ రామ్ చరణ్, జెనీలియా కొన్ని కీలక సన్నివేశాల నిమిత్తం సిడ్నీలో ఉండటం విశేషం. మగధీర వంటి గ్రాఫిక్ ఉన్న చిత్రానికే 38 కోట్లు అయింది...అలాంటిది ఓ లవ్ స్టోరికి ముప్పై ఐదు కోట్లా అని చిరంజీవి ప్రశ్న. కరెక్టే కదా.


Click it and Unblock the Notifications











