చిరు ‘సాంగ్’తో పాటు పాపులర్ డైలాగ్ తో ‘రచ్చ’ రచ్చ చేస్తున్న చరణ్...!?
చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ అనే టైటిల్ తో రూపొందుతున్న సినమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తన తండ్రి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఓ పాటను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాట కోసం చరణ్ బీభత్సమైన స్టెప్పులేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ సర్కిల్స్ లో. చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు" సినిమాలోని 'బంగారు కోడీ పెట్ట..." పాటను రీమిక్స్ చేసి 'మగధీర" సినిమాలో స్టెప్పులేసి క్రేజ్ పెంచుకొన్న మెగాపవర్ స్టార్ మళ్ళీ రచ్చతో రచ్చచేసేయనున్నాడు.
ఈ చిత్రానికి సంభందించిన లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే రచ్చలో గ్యాంగ్ లీడర్ సినిమాలోని సాంగ్ తో పాటు ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన 'చెయ్యి చూసావా ఎంత్ రఫ్ గా ఉందో..రఫ్ ఆడించేస్తా" అనే డైలాగ్ ను పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. పరాస్ జైన్, ఎన్ వి ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











