మరో మలయాళ రీమేక్ మీద కన్నేసిన మెగాస్టార్.. బాలయ్య చేద్దామనుకున్నా చివరికి చిరంజీవి వద్దకే!

ఈ మధ్య అన్ని భాషల దర్శక నిర్మాతలు కూడా ఇతర భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ ఎలాగు హిట్ అయింది కాబట్టి ఇక్కడ సినిమా ఇబ్బంది పెట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి దాని మీద కోట్లు కుమ్మరించడానికి కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే తెలుగులో అనేక తమిళ, మలయాళ రీమేక్ సినిమాలు తెరకెక్కుతుండగా మెగాస్టార్ చిరంజీవి మరో తమిళ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మరో రీమేక్ సినిమా

మరో రీమేక్ సినిమా

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 2 రీమేక్ సినిమాలు చేస్తున్నారు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ సినిమా వేదళం రీమేక్ చేస్తూ ఉండగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమా రీమేక్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 మంచి స్పందన

మంచి స్పందన

అయితే బాలకృష్ణ చేయాల్సిన ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి చేస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు విషయం ఏమిటంటే మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. సినిమాలో మోహన్ లాల్ సరసన మీనా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ నటించింది.

ఆద్యంతం ఆసక్తికరంగా

ఆద్యంతం ఆసక్తికరంగా


సినిమా కథ చాలా చిన్నదే అయినా ఆద్యంతం ఆసక్తికరంగా సాగి పోతుంది. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉండగా తండ్రి మరోసారి భార్యను గర్భవతిని చేస్తే అదే సమయానికి కొడుకు కూడా పెళ్లి కాకుండానే మరో యువతిని గర్భవతిని చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే అంశం మీద ఈ సినిమా రూపొందించారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు

గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు


నిజానికి తొలుత ఈ సినిమా కథ బాగుందని కొందరు నందమూరి బాలకృష్ణ వద్దకు తీసుకు వెళ్లారు. రీమేక్ సినిమాలు విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపించని బాలకృష్ణ ఈ సినిమాలో పృథ్వీరాజ్ మోహన్ లాల్ మధ్య కొన్ని సన్నివేశాలు సినిమా మేకింగ్ చూసి సినిమా మీద ఆసక్తి పెంచుకున్నారు.. సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి వద్దకు తీసుకు వెళ్ళగా ఆయన చూసిన వెంటనే సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎవరితో

ఎవరితో


సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుండడమే కాక రియాలిటీకి దగ్గరగా ఉందని ఆయన అన్నారట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లూసిఫర్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాకు కూడా మెగాస్టార్ చిరంజీవి అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. మరి చివరికి ఈ ఎవరితో పట్టాలు ఎక్కబోతోంది అనేది అధికారిక ప్రకటన వెలువడితే గాని చెప్పలేం. అన్నట్టు ఈ సినిమాని దగ్గుబాటి వెంకటేష్ రానా ప్రధాన పాత్రలలో తెరకెక్కించనున్నారు అని కూడా ప్రచారం జరిగింది కానీ దాని మీద కూడా అధికారిక ప్రకటన లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X