For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో చిరంజీవి మూవీ: ఆ హామీతో గ్రీన్ సిగ్నల్.. దీనివల్ల అవన్నీ వెనక్కే

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన.. మరికొన్ని చిత్రాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలను కూడా ప్రకటించారాయన. ఈ క్రమంలోనే మంచి కథతో తన దగ్గరకు వచ్చిన వాళ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇలా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా దర్శకుడు? పూర్తి వివరాలు మీకోసం!

  ‘ఆచార్య'గా రాబోతున్న మెగాస్టార్

  ‘ఆచార్య'గా రాబోతున్న మెగాస్టార్

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి, చరణ్ నక్సలైట్లుగా చేస్తున్నారు.

  తమిళ డైరెక్టర్‌తో లూసీఫర్ రీమేక్‌

  తమిళ డైరెక్టర్‌తో లూసీఫర్ రీమేక్‌

  ‘ఆచార్య' మూవీ పట్టాలపై ఉండగానే.. మెగాస్టార్ చిరంజీవి మలయాళ మూవీ ‘లూసీఫర్'ను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసిన యూనిట్ త్వరలోనే దీన్ని ప్రారంభించనుంది.

  ఫ్లాపుల డైరెక్టర్‌కు చిరంజీవి ఆఫర్

  ఫ్లాపుల డైరెక్టర్‌కు చిరంజీవి ఆఫర్

  టాలీవుడ్‌లో వరుస పెట్టి చాలా సినిమాలను తెరకెక్కించినా.. ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేష్. అలాంటి దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు. అతడితో తమిళంలో బంపర్ హిట్ అయిన ‘వేదాళం'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి గుండు లుక్‌తో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

  బాబీతో సినిమాను ప్రకటించారుగా

  బాబీతో సినిమాను ప్రకటించారుగా

  ‘ఆచార్య' రిలీజ్ కాకముందే మూడు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ రూపొందించే మూవీ కూడా ఒకటి ఉంది. ఆ మధ్య జరిగిన ‘ఉప్పెన' ఈవెంట్‌లోనూ చిరు దీన్ని ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. తెలుగు కొత్త కథతోనే ఈ చిత్రం రూపొందనుంది.

  మరో రీమేక్‌కూ మెగాస్టార్ సిగ్నల్

  మరో రీమేక్‌కూ మెగాస్టార్ సిగ్నల్

  రీఎంట్రీలో చిరంజీవి రీమేక్ మూవీలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150'ని చేసిన ఆయన.. దీని తర్వాత ‘లూసీఫర్', ‘వేదాళం' చిత్రాలను కూడా తెలుగులోకి మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇవి పట్టాలు ఎక్కకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘ఎన్నై అరిదాల్' మెగాస్టార్ రీమేక్ చేయనున్నారట. దీన్ని సుజిత్ తెరకెక్కిస్తాడని టాక్.

  స్టార్ డైరెక్టర్‌కు చిరు పచ్చ జెండా

  స్టార్ డైరెక్టర్‌కు చిరు పచ్చ జెండా

  వరుసగా సినిమాల మీద సినిమాలు ప్రకటించుకుంటూ పోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయినప్పటికీ మరికొందరు దర్శకులతో కథాపరమైన చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తనకు గతంలో రెండు భారీ హిట్లు ‘ఠాగూర్', ‘ఖైదీ నెంబర్ 150' ఇచ్చిన వీవీ వినాయక్‌తో చిరంజీవి చర్చలు జరిపారట. ఈ నేపథ్యంలోనే అతడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

  Happy birthday Balakrishna:Twitter lights up as fans & celebs celebrate actor's day|Filmibeat Telugu
  ఆ హామీతో.. దీనివల్ల అవన్నీ వెనక్కే

  ఆ హామీతో.. దీనివల్ల అవన్నీ వెనక్కే

  తాజా సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి.. వీవీ వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పారట. దీనికి కారణం కథ నచ్చడంతో పాటు సినిమాను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేస్తానని సదరు దర్శకుడు హామీ ఇవ్వడమేనని తెలుస్తోంది. అంతేకాదు, ఈ చిత్రాన్ని లూసీఫర్ రీమేక్ తర్వాత మొదలెడతారట. అంటే.. వేదాళం రీమేక్‌తో పాటు బాబీ మూవీ వెనక్కి వెళ్లినట్లే.

  English summary
  Megastar Chiranjeevi Now Doing Acharya with Koratala Shiva. After That He will do Mohan Raja, Mehar Ramesh and Bobby Direction. Now News is That Chiranjeevi to do A Film with V. V. Vinayak
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X