కథ ఓకే: పర్మిషన్ కోసం చిరంజీవి ఎదరు చూపులు?
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన దృష్టంతా త్వరలో చేయబోయే 150వ సినిమాపైనే పెట్టారు. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కాకుండా పూర్తి స్థాయి ఎంటర్టెన్మెంట్ కథల వైపే మొగ్గు చూపుతున్న ఆయన ఇప్పటికే చాలా కథలు విన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ కథను ఫైనల్ చేయలేదు.
గత నెల చిరంజీవి పుట్టినరోజునే 150వ సినిమా ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే కథ ఫైనల్ కాక పోవడంతో ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం చిరంజీవి ఓ కథను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. అయితే ఎవరి కథ ఫైనల్ చేసారు? ఎలాంటి కథ అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే' సినిమా షూటింగులో భాగంగా విదేశాల్లో ఉండటంతో అతను వచ్చిన తర్వాత మాట్లాడి కథ విషయంలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారట. చరణ్‌తో పాటు తన భార్య సురేఖకు కూడా కథ వినిపించి ఆ తర్వాత 150వ సినిమా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. సురేఖ సమర్పణలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. నిర్మాతలు వీరే కాబట్టి....వారి ఓ మాట చెప్పి పర్మిషన్ తీసుకుంటే బావుంటుందని చిరంజీవి భావిస్తున్నారట.
ఇక చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఖరారు కాలేదు. వినాయక్ కూడా ఈ సినిమా అవకాశం దక్కించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అందుకే ‘అల్లుడు శ్రీను' తర్వాత ఏ సినిమా చేయకుండా ఖాళీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











