God Father కోసం చిరంజీవి డేరింగ్ స్టెప్: ఆమె దొరికే వరకూ అది మొదలు పెట్టారట

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోన్నా.. ఇప్పటికీ అదే గ్రేస్‌తో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు మజాను పంచుతూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను అందుకున్న ఈ సీనియర్ హీరో.. చాలా కాలం పాటు గ్లామర్ ఫీల్డుకు విరామం ప్రకటించారు. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చారు. అది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఇప్పటికే 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు.

'ఆచార్య' పట్టాలపై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో 'గాడ్ ఫాదర్' ఒకటి. సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ మలయాళంలో తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. ఈ సినిమా తెలుగు సహా దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దీన్నే 'గాడ్ ఫాదర్'గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ మధ్య మొదలైంది.

Chiranjeevi Hold God Father Shooting for Sister Role

మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసీఫర్' మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా. అలాగే, ఇందులో హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేశాడు. దీని కోసం స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడిచింది. ఈ పాత్ర తర్వాత ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది ఇందులో మంజూ వారియర్ పోషించిన హీరో చెల్లెలి రోల్ మాత్రమే. తాజాగా దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

'గాడ్ ఫాదర్' మూవీలో అత్యంత ముఖ్యమైన హీరో చెల్లెలి పాత్రకు ఫలానా హీరోయిన్‌ను తీసుకుంటున్నారని చాలా రోజులుగా ఎన్నో పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే శోభన పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ రోల్ కోసం ఎవరినీ ఫైనల్ చేయలేదట. ఈ నేపథ్యంలోనే చెల్లెలి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కాకుండా మిగిలిన పార్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణయించాడట. ఇందుకోసం ఇప్పటికే దర్శకుడికి సలహాలు కూడా ఇచ్చాడని అంటున్నారు. దీంతో ఆ పాత్రకు నటి ఫిక్స్ అయిన తర్వాతనే ఆ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారన్న మాట.

'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా నటిస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందించబోతున్నాడు. సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X