విశ్వంభరలో ‘పాత చిరంజీవి’.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూవీ హిట్టే!
ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య కాలంలో ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మూవీలతో ప్రేక్షకులను, అభిమానులను మెప్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరు 'విశ్వంభర' చేస్తున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్టతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమానే 'విశ్వంభర'. ఈ మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. ఇందులో హీరో పలు లోకాలను చుట్టి వచ్చే వీరుడిగా నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని నెక్ట్స్ లెవెల్‌గా రూపొందిస్తున్నారు.

విజువల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం త్రిష, సురభి, ఇషా చావ్లా తదితరులు కూడా షూట్‌లో జాయిన్ అవగా.. వీళ్లపై కీ సీన్స్‌ను తెరకెక్కించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను పెడుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఒకప్పటి చిరంజీవిని, ఆయన ఎనర్జీని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

హై రేంజ్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రం ఆయన వేసే హుక్ స్టెప్స్ 'ఇంద్ర', 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' చిత్రాలను మించిపోయేలా ఉంటాయట. ఇప్పటికే కీరవాణి వీటికి ట్యూన్స్ కూడా ఇచ్చేశారని తెలిసింది. అంటే.. అవి హిట్ అయినట్లే ఈ మూవీ కూడా చిరంజీవికి సక్సెస్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉండగా.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











