విధి విలాసం: టీవీ యాంకర్‌గా మెగా స్టార్ చిరంజీవి!
హైదరాబాద్: విధి నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. నిన్నమొన్నటి వరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా అంతర్జాతీయ పర్యటనలు చేస్తూ ఓ రేంజిలో వెలిగిపోయిన చిరంజీవి పరిస్థితి ఎన్నికల ఫలితాల అనంతరం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం నుండి పడిపోకుండా నిలబెట్టిన హీరో. ఇపుడు జీరో. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం చిరంజీవి ఇమేజ్‌ను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి జీరో ఫలితాలు వచ్చాయి.
ఆసంగతి పక్కన పెడితే....ప్రస్తుం చిరంజీవి గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఖాళీగా ఉన్న చిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు బుల్లితెరపై కూడా చిరంజీవి కనిపించబోతున్నారట. తెలుగులో ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించబోతున్న ఓ రియాల్టీ షోకి ఆయన హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనిపై ఇప్పటికే ఆ ఛానెల్ యాజమాన్యం చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు ఈ ఆగస్టులో వస్తున్న తన పుట్టిన రోజునాడు తన 150 సినిమా గురించి ప్రకటిస్తారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ అంశాలు జోడించడంతో పాటు తన పొలిటికల్ కెరీర్‌కు ప్లస్సయ్యే విధంగా సందేశాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియజనున్నాయి.


Click it and Unblock the Notifications











