చిరంజీవి అది తెలుసుకొన్నాడు కాబట్టే మెగాస్టార్ కాగలిగాడు....!?
సినీ హీరో అన్నాక హిట్లూ వస్తుంటాయి..ప్లాపులు వస్తుంటాయి. హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ప్లాపులొచ్చినప్పుడు కుంగి పోకుండా ఉన్నవాడే నిజమైన హీరో. నిజానికి హిట్టు వచ్చినప్పటికంటే ప్లాపు వచ్చినప్పుడే మరింత కసితో పనిచేయాలి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే యువ హీరో రామ్ చరణ్ తేజ్ కు 'మగధీర"వంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చాక, వెంటనే 'ఆరెంజ్" వంటి ప్లాపు రావటంతో, ఆ ప్లాపుని తట్టుకోవటం చాలా కష్టమైన విషయమే. అప్పుడే సమయమనం పాటించాలి.
అలా కాకుండా మొన్న క్రిస్ మస్ పార్టీకి వెళ్ళి వస్తూంటే, రామ్ చరణ్ తేజ్ కారుతో విజయవాడ కాంగ్రెసు యమ్.పి.లగడపాటి రాజగోపాల్ కుమారుడు పోటీపడ్డాడట. దాంతో వళ్ళుమండిన రామ్ చరణ్ అతని కారాపి గొడవకు దిగాడట. ఆ కుర్రాడు కూడా ఏమాత్రం తగ్గకుండా గొడవకు సై అంటే సై అన్నాడట. ఈ లోగా బన్నీ, అదేనండీ అల్లు అర్జున్ అక్కడికి చేరుకుని ఆ గొడవను సర్దేశాడని సమాచారం. ఒక హీరోకి ముఖ్యంగా కావలసింది మెంటల్ బ్యాలెన్స్. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. ఇది తెలుసుకున్నాడు కాబట్టే చిరంజీవి మెగాస్టార్ కాగలిగాడు. రామ్ చరణ్ కూడా ఈ నిజాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.


Click it and Unblock the Notifications











