Chiranjeevi తో డైరెక్టర్ మారుతి మూవీ.. క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్?
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత సినిమాల జోరు పెంచారు. ఖైదీ నంబర్ 150 తర్వాత ప్రేక్షకులకు మరింత చేరువ కావాలన్న ప్రయత్నంతో భారీ బడ్జెట్ చిత్రాలకు, అగ్ర దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే చిరంజీవి జోష్‌తో షూటింగుతో ముందుకెళ్తుంటే కరోనావైరస్ కారణంగా బ్రేకులు పడ్డాయి. అయితే రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటించారు. మలయాళంలో విజయవంతమై లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్, అలాగే భోళా శంకర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇదిలా ఉండగా, యువ దర్శకుడు మారుతితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల మెగాస్టార్‌కు ఓ లైన్ చెప్పగా ఆ పాయింట్ నచ్చడంతో చిరంజీవి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే ఆ ప్రాజెక్టు పూర్తిగా రూపాంతరం చెందితే క్రేజీ ప్రాజెక్టు అవుతుందనే భావనలో చిరంజీవి, మారుతి ఉన్నట్టు తెలిసింది.
అయితే మారుతి చెప్పిన పాయింట్‌తో ఇంప్రెస్ అయిన చిరంజీవి స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో డెవలప్ చేయమని అడిగినట్టు తెలిసింది. ప్రస్తుతం మారుతి సీరియస్‌గా ఆ సినిమా స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఆ సినిమా వర్కవుట్ అయితే వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. దాంతో తన తదుపరి ప్రాజెక్టులకు కాస్త పక్కన పెట్టి చిరంజీవి కోసం స్క్రిప్టు కోసం పనిచేస్తున్నట్టు సమాచారం.
ఇక మారుతి విషయానికి వస్తే.. ఇటీవల ఆయన రూపొందించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి చిత్రం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తున్నది. దీపావళీ కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ మంచి కలెక్షన్లను నమోదు చేస్తున్నది.
ఖైదీ నంబర్ 150 చిత్రం తర్వాత సైరా నర్సింహరెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ఆచార్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











