తమన్నాను అడ్డుపెట్టుకొని శ్రీ రెడ్డిపై సెటైర్స్.. చిరంజీవి మాటల వెనుక సీక్రెట్ ఇదేనా?

సంచలన తార శ్రీ రెడ్డి విషయమై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో శ్రీ రెడ్డి- చిరంజీవి ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్‌కి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరు.. అక్కడి వేదికపై మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి పోతే..

తమన్నాపై మెగాస్టార్ కామెంట్స్.. ఇక్కడే పడింది బీజం

తమన్నాపై మెగాస్టార్ కామెంట్స్.. ఇక్కడే పడింది బీజం

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇంతలో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వంతు వచ్చింది. దీంతో ఆమెను ఉద్దేశ్యించి మాట్లాడిన చిరంజీవి, ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు అనేయడమే ఈ చర్చలకు బీజం వేసింది.

డేరింగ్ పర్సనాలిటీ తమన్నా అంటూ చిరు

డేరింగ్ పర్సనాలిటీ తమన్నా అంటూ చిరు

ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు అంటూ తమన్నా సింహాద్రిని తెగ పొగిడారు మెగాస్టార్. పోరాటంలో తన స్నేహితుల తప్పు ఉందన్న విషయం తెలిస్తే వారిని కూడా వదిలిపెట్టని డేరింగ్ పర్సనాలిటీ తమన్నా అని చిరు అన్నారు. ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ అంటూ తమన్నాపై కామెంట్ చేశారు చిరంజీవి.

చిరంజీవి గంభీర స్వరం.. తమన్నా భావోద్వేగం

చిరంజీవి గంభీర స్వరం.. తమన్నా భావోద్వేగం

ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందో మనిద్దరికీ మాత్రమే అర్ధమవుతుంది అంటూ చిరంజీవి గంభీర స్వరంతో మాట్లాడటం చూసి తమన్నా భావోద్వేగానికి గురైంది. దీంతో ఇదంతా చూసి.. తమన్నాను అడ్డుపెట్టుకొని చిరంజీవి ఇన్ డైరెక్టుగా శ్రీ రెడ్డి పేరు పెట్టకుండా సెటైర్లు వేశారనే టాక్ బయటకు వచ్చేసింది.

శ్రీరెడ్డికి చిరంజీవి కౌంటర్

శ్రీరెడ్డికి చిరంజీవి కౌంటర్

గతంలో శ్రీ రెడ్డి అసభ్యకర మాటలు మాట్లాడుతున్నపుడు ఆమెకు వ్యతిరేకంగా తమన్నా కామెంట్స్ చేసింది. ఆ సందర్భం మీదే ఇప్పుడు తమన్నాను అభినందిస్తూ.. శ్రీ రెడ్డిపై సెటైర్లు మెగాస్టార్ సెటైర్లు వేశారని వార్తలు వస్తున్నాయి. గతంలో శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటిదాకా స్పందించని చిరంజీవి, ఇప్పుడు శ్రీరెడ్డికి పరోక్షంగా కౌంటర్ విసిరాడని అంటున్నారు జనం.

చర్చనీయాంశంగా శ్రీ రెడ్డి వ్యవహారం

చర్చనీయాంశంగా శ్రీ రెడ్డి వ్యవహారం

ఎప్పుడు ఎవరిపై, ఎలా బాంబులు వేస్తుందో తెలియదన్నట్లుగా ఉంది శ్రీ రెడ్డి వ్యవహారం. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా ఆమె పెడుతున్న పోస్టులు సంచలనం సృష్టిస్తూ పలు చర్చలకు దారి తీస్తున్నాయి. టాలీవుడ్ బడా నటీనటులు, దర్శకనిర్మాతలను టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతోంది శ్రీ రెడ్డి.

ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో మరి

ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో మరి

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో శ్రీరెడ్డి పై చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు చేశారనే వార్తలు నెట్టింట సంచలనంగా మారాయి. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో!. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌గా రాహుల్ సింప్లిగంజ్ మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X