ఇన్ సెక్యూరిటీ ఫీలవుతున్న చిరంజీవి..
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కాస్తా ఇప్పుడు అధికార పార్టీలో ఒక సాధారణ ఎమ్మేల్యేగా మారిపోయాడు చిరంజీవి. స్వయంకృషితో నటుడిగా ఎదిగిన చిరంజీవి స్వయంకృతంతో నాయకుడిగా నిలబడలేకపోయాడు. మీడియా ఏనాడో లైట్ తీసుకున్న చిరంజీవి ఇప్పుడు రాజకీయంగా ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా అతని మాటలకి విలువ అంటూ ఉంటే అది కేవలం సినిమాలకి సంబంధించే. ఈ సంగతి గుర్తించిన చిరంజీవి వార్తల్లో తన పేరు వినిపించేందుకు తన 150వ సినిమా ప్రస్తావన తెస్తున్నాడు.
మీడియా కూడా అతని మాటల్ని పట్టించుకుని పబ్లిసిటీ ఇస్తోంది. అదే పొలిటికల్ మేటర్ ఏదైనా మాట్లాడితే చిరంజీవి కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో తనని జనం మర్చిపోతున్నారనే అభద్రతాభావంతో చిరంజీవి మళ్ళీ నటించాలని అనుకుంటున్నారు. అయితే ఎలాంటి సినిమా చేయాలనే విషయంలోనూ అతనికి క్లారిటీ లేక దానిని సాగదీస్తూ పోతున్నాడు..
chiranjeevi ram charan teja vv vinayak puri jagannath nagababu చిరంజీవి రామ్ చరణ్ తేజ్ వివి వినాయక్ పూరి జగన్నాథ్ నాగబాబు


Click it and Unblock the Notifications