లక్ష బీర్ బాటిళ్లతో చిరంజీవి.. 68 ఏళ్ల వయసులో రిస్క్ చేస్తున్న మెగాస్టార్

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరికొత్త ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అలా ఈ కొన్నేళ్ల వ్యవధిలోనే ఎన్నో మూవీలతో వచ్చిన ఆయన.. తన రేంజ్‌ను మరింతగా పెంచుకున్నారు. ఈ ఊపులోనే ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నారు.

'బింబిసార'తో తనదైన ఎంట్రీని సొంతం చేసుకున్న మల్లిడి వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రమే 'విశ్వంభర'. ఈ మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఇందులో హీరో ముల్లోకాలను చుట్టి వచ్చే అతీత శక్తులున్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని గ్రాండ్‌గా తీస్తున్నారు.

Chiranjeevi Interval Fight Main Highlight In Viswambhara Movie

గ్రాఫిక్స్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌‌ను ఈ ఏడాది ఆరంభంలోనే ప్రారంభించారు. అప్పటి నుంచి చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి 30 శాతం వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాలో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో సన్నివేశాలు, సాంగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో యాక్షన్ పార్టును సైతం సరికొత్తగా డిజైన్ చేస్తున్నారట. తాజాగా దీనిపై ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.

Chiranjeevi Interval Fight Main Highlight In Viswambhara Movie

తాజా సమాచారం ప్రకారం.. 'విశ్వంభర' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లక్ష బీర్ బాటిళ్లతో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే దీనికోసం చిరంజీవి 68 ఏళ్ల వయసులోనూ ఎన్నో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ షూట్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని సమాచారం. ఈ ఫైట్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ మరింతగా పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా, నవీన్ చంద్ర, రాజ్‌ తరుణ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X