మేనల్లుడి కోసం రంగంలోకి దిగిన చిరంజీవి.. కథని జల్లెడ పట్టేశాడు!
మెగా ఫ్యామిలీ నుంచి రెండవ తరం హీరోలుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో స్టార్ సాయిధరమ్ తేజ్ అని ఆరంభంలో అంతా భావించారు. వరుణ్ తేజ్ కూడా సినిమా సినిమాకు తన పరిధి పెంచుకుంటున్నాడు. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ చాలా కాలంగా వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల కిషోర్ తిరుమల దర్శత్వంలో తేజు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఏ సినిమా తప్పనిసరిగా విజయం సాధించాలి. లేకుంటే మెగా మేనల్లుడి కెరీర్ మరింత సందిగ్ధంలో పడుతుంది. కానీ తేజకు సంతోషాన్ని కలిగించేలా ఓ శుభ పరిణామం ఈ చిత్రం విషయంలో జరుగుతోందని ప్రచారం మొదలైంది.

చిత్రలహరి ప్రారంభం
తేజ్ ఐ లవ్ యు చిత్రం నిరాశ పరిచిన తరువాత సాయిధరమ్ తేజ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో అమెరికా వెళ్లి తన మేకోవర్ మార్చుకున్నాడు. చిత్రలహరి చిత్రంలో తేజు సరికొత్తగా కనిపిస్తాడట. నేను శైలజ చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.

రంగంలోకి మెగాస్టార్
సాయిధరమ్ తేజ్ కు ఈ చిత్రం చాలా కీలకమైంది. దీనితో తేజు తన మెగాస్టార్ మావయ్యని ఈ సినిమా విషయంలో సలహా ఇవ్వమని కోరాడట. వెంటనే చిరు రంగంలోకి దిగిపోయి కథని పరిశీలించినట్లు తెలుస్తోంది. గతంలో చిరు చరణ్, తేజు సినిమాలలో ఎడిటింగ్ సమయంలో తన సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు షూటింగ్ కు ముందే చిత్రలహరి కథలో కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఓకె చేస్తే
చిరు సూచించిన మార్పులు ఒకే అయ్యాక షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కిషోర్ తిరుమల రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

వరుసగా ఆరు చిత్రాలు
తేజు చివరగా సుప్రీం చిత్రంతో విజయం అందుకున్నాడు. ఆ తరువాత తేజు నటించిన ఆరు చిత్రాలూ వరుసగా పరాజయాన్ని చవిచూశాయి. దీనితో తేజు కథల ఎంపికలో తప్పులు చేస్తన్నాడనే విమర్శలు వినిపించాయి. చిత్రలహరి సినిమా తేజుకి అవసరమైన హిట్ ఇస్తుందేమో చూడాలి.
Recommended Video



Click it and Unblock the Notifications











