చిరు-కొరటాల మధ్య పెరిగిన దూరం.. మహేష్ బాబే కారణమంటూ టాక్.. అసలేం జరిగిందంటే..?
హెడ్డింగ్ చదివిన వెంటనే.. అవునా? నిజమా? అనే ఆలోచనలు మెదడులోకి వచ్చేసి ఉంటుంది కదూ. అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. కొరటాల శివ చర్యలకు చిరంజీవి అప్‌సెట్ అయినట్టు తెలుస్తోంది. ఇలా కావడానికి మహేష్ బాబు వ్యవహరామే కారణమని టాక్. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

భారీగా తెరకెక్కుతున్న ఆచార్య
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌ను నోరు జారి చిరంజీవే అధికారికంగా ప్రకటించేశాడు. ఈ మూవీ నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉండటం చర్చనీయాంశమవుతోంది.

త్రిష అవుట్.. అనుష్క ఇన్..
ఆచార్య నుంచి తప్పుకుంటున్నట్టు త్రిష ప్రకటించడం సెన్సేషన్‌గా మారింది. కథలో మార్పులు, తన పాత్ర ప్రాధాన్యం తగ్గించడంతో హర్ట్ అయిన త్రిష.. మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారని టాక్ రాగా.. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం అనుష్కను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

మహేష్ కాదు చరణ్..
ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించనున్నాడనన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఆ పాత్రను మహేష్ బాబు పోషిస్తాడని వార్తలు వచ్చాయి. మళ్లీ కొద్ది రోజుల తరువాత అలాంటిదేమీ లేదు.. ఆ పాత్రను రామ్ చరణే చేస్తున్నాడని వచ్చాయి.

చిరును సంప్రదించకుండా..
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్‌లో బిజీగా ఉండటంతో ఆ పాత్రను మహేష్ బాబుతో చేయించాలని కొరటాల భావించి సంప్రదించాడట. అయితే చిరుకు మాత్రం మాట కూడా చెప్పకుండా ఈ వ్యవహారం నడిపించాడట. అయితే కొరటాల చెప్పేలోపే వార్తలు రావడం, అవి చిరు చెవిలో పడ్డాయట.
Recommended Video

కొరటాలపై కస్సుబుస్సు..
తనను సంప్రదించకుండా మహేష్ బాబును క్యారెక్టర్ కోసం అడగడంపై కొరటాల పట్ట అసంతృప్తినే ఉన్నాడట. బడ్జెట్ దృష్ట్యా ఆ పాత్రకు రామ్ చరణ్ అయితేనే బాగుంటుందని యూనిట్ ఫిక్స్ అయిందంట. అయితే వీటిపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











