చిరంజీవి దీనికి భయపడతారా?

పను విషయాల్లో చిరంజీవి నిక్కచ్చిగా ఉంటారని ఆయన ఆదాయపు పన్ను లేదా ఆస్ధి పన్ను బకాయిలు లేకుండా చూసుకూంటారని అయన రాజకీయ ప్రవేశాన్ని బలపరుస్తున్న సన్నిహితులు అంటున్నారు. చిరంజీవి ఐటి అకౌంట్ ఇంకా చెన్నైలోనే ఉన్న విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. చిరంజీవి అకౌంట్ ను హైదరాబాద్ బదలాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ అధికారులు చెన్నై అధికారులను కోరినట్టు తెలుస్తోంది. ఏమైనప్పటికీ సినిమా రంగంపై ఐటీ అధికారులు దృష్టి పెట్టడం వెనుక చిరంజీవిని రాజకీయాల్లోకి రాకుండా భయపెట్టే ఉద్దేశం దాగి ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











