చిరు కొత్త సినిమా అప్డేట్​.. 17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్​తో.. షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్​!

మెగాస్టార్ చిరంజీవి.. ఏజ్ బార్ అయినప్పటికీ.. హీరోగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి... మల్టీస్టారర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నా స్థాయిలో రాలేదు. ఇప్పుడు ఆయన మరోసారి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...

నెక్ట్స్ మూవీ అప్డేట్...:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్యతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ అంటూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ ఆకట్టుకోగా... ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. దీనికి కూడా మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఆయన నెక్ట్స్ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Chiranjeevi Kalyan Krishna Kurasala Movie Cast and Crew Details after 17 years chiru pairs up with trisha

యంగ్ హీరోతో మల్టీ స్టారర్:చిరంజీవి, దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చిరంజీవికి కల్యాణ్‌ కృష్ణ ఓ కథ వినిపించారని సమాచారం. ఈ స్క్రిప్ట్‌ చిరంజీవికి నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటిస్తే.. కుమారుడుగా ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం.

Chiranjeevi Kalyan Krishna Kurasala Movie Cast and Crew Details after 17 years chiru pairs up with trisha

17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో:ఈ సినిమా కథ విషయానికి వస్తే... తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథగా ఈ సినిమా రాబోతుంది. అయితే తండ్రి పాత్రలో చిరంజీవి నటించగా.. కొడుకు పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటించనుండగా... సిద్ధూకు జోడీగా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. 17 ఏళ్ల తర్వాత చిరు త్రిషలు ఈ సినిమాలో నటించబోతున్నారని... ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక శ్రీలీల ఈమధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మొన్న మహేశ్, పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోగా.. ఇప్పుడు చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్.

Chiranjeevi Kalyan Krishna Kurasala Movie Cast and Crew Details after 17 years chiru pairs up with trisha

అప్పుడే అనౌన్స్...:సొగ్గాడే చిన్ని నాయనా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగు పెట్టాడు కల్యాణ్ కృష్ణ. ఆ తర్వాత పలు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. బంగార్రాజు సినిమా తర్వాత ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే అవకాశం కొట్టేశాడని టాక్. ఇక ఈ సినిమాకు సుస్మితా కొణిదెల ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుందట. ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 23న చిరంజీవి బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Chiranjeevi Kalyan Krishna Kurasala Movie Cast and Crew Details after 17 years chiru pairs up with trisha

తండ్రి కొడుకులుగా... :చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మలయాళం బ్రో డాడీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. మలయాళంలో స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన బ్రో డాడీ సినిమాను తెలుగులో తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయి.. ఆకట్టుకుంది. గతంలో ఈ సినిమాను వెంకటేశ్ రానా రీమేక్ చేస్తారనే వార్తలు రాగా.. ఇప్పుడు చిరు, సిద్దూ చేస్తారని వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X