చరణ్‌పై ఓ కన్నేసిన చిరు..(దారి తప్పకుండా?)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో చరణ్ చేస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ 'జంజీర్' ప్రాజెక్ట్ అతి ప్రధాన మైనది. జంజీర్ సినిమాపై చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఓ కన్నేసి ఉంచాడని, చరణ్ తనలా రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా బాలీవుడ్లో రాణించాలని చిరంజీవి తాపత్రయ పడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
చిరంజీవి ఇలా ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. చిరంజీవి కూడా గతంలో బాలీవుడ్లో తెరంగ్రేటం చేశారు. అయితే ఆయన అక్కడ రాణించ లేక పోయారు. తను అక్కడ రాణించ లేక పోవడానికి కారణాలు విశ్లేషించుకున్న చిరంజీవి తన కొడుకు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడట.
ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు చిరంజీవి ఇలా చేయడంలో ఆశ్చర్య పోవాల్సిన పనేమీ లేదు. మరి చరణ్ బాలీవుడ్ ఆశ, చిరంజీవి కల ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. జంజీర్ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంయుక్తంగా అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆచిత్రానికి రీమేక్‌గా రామ్ చరణ్ 'జంజీర్'చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











