Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇన్నాళ్లు ఓపిక పట్టిన స్టార్ డైరెక్టర్ చివరకు మెగాస్టార్ పుట్టిన రోజునే టార్గెట్ చేశాడుగా!
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఉంది ప్రేక్షక లోకం. గతేడాది 'భరత్ అనే నేను' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన కొరటాల.. ఆ తర్వాత మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాక పోవడంతో కాస్త నిరాశగానే ఉన్నారు ఆయన అభిమానులు. అయితే కొరటాల శివ తర్వాతి సినిమా మెగాస్టార్ చిరంజీవితో కావడంతో ఇన్ని రోజులు ఓపికగా ఉన్న ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా అప్డేట్స్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.
ఖైదీ నెంబర్ 150 ద్వారా సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు త్వరలోనే గుమ్మడికాయ కొట్టేయనున్నారు. ఇక ఆ వెంటనే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కొరటాల శివ సినిమా పూర్తి చేసేయాలని భావిస్తున్నారట మెగాస్టార్.
కొరటాల శివతో మెగాస్టార్ చేయబోయేది తన 152 వ చిత్రం. కొరటాల టాలెంట్ చూసిన చిరు స్వయంగా ఆయనతో సినిమా చేసేందుకు ముందుకు రావడం విశేషం. సైరా షూటింగ్ లేట్ కావడం కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్ర ప్రారంభానికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజునే టార్గెట్ గా పెట్టుకున్నారట కొరటాల. మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగస్టు 22న మెగా 152ని సెట్స్ పైకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట కొరటాల.
చిరు, కొరటాల శివ కాంబోలో రానున్న మెగా 152 ప్రాజెక్ట్ ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు సంయుక్తంగా సమర్పించనున్నాయి. కమర్షియల్ అంశాలతో సామాజిక సందేశం మిక్స్ చేసి, సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కొరటాల శివ.. మెగా 152 ప్రాజెక్టుతో మరోసారి అలాంటి ప్రయత్నమే చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్ట్‌లో లాంఛనంగా ప్రారంభించి వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట కొరటాల.