చిరంజీవితో సినిమాపై కొరటాల స్కెచ్.. మెగా అభిమానుల్లో జోష్ నింపే లేటెస్ట్ అప్‌డేట్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రాజెక్టు కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సామాజిక అంశాలతో ముడిపెడుతూ దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నారు కొరటాల. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ తన లుక్ కూడా చేంజ్ చేసుకొని సరికొత్తగా కనిపించేందుకు రెడీ అయ్యారు.

ఇటీవలే కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అప్‌డేట్ ప్రకారం కొరటాల ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

Chiranjeevi- Koratala Siva movie Itresting update.. Release date confirm

అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటిదాకా హీరోయిన్ అనుకున్న త్రిష స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి 2020 స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట కొరటాల శివ. చిత్ర కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడనని ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్, కొరటాలకు మాటిచ్చారని సమాచారం. ఏదేమైనా షూటింగ్ ప్రారంభానికి ముంచే ఈ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X