చిరు 152: ఈ సారి కొరటాల ఇలా డిసైడ్ అయ్యారా? ఇదే జరిగితే..!!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత సెలక్టెడ్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్, ఈ సారి కొరటాల శివకు ఛాన్సిచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భాగం కానుండటం విశేషం.
సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేయగల కొరటాల.. చిరంజీవి కోసం బలమైన కథ సిద్ధం చేసుకున్నారని విన్నాం. ఈ చిత్రాన్ని దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని టాక్ నడించింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఇందులో మరో సామాజిక అంశాన్ని టచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ అంశం గతంలో ఎప్పుడూ టచ్ చేయనిదని తెలుస్తోంది.

గతంలో 'శ్రీమంతుడు' సినిమాలో గ్రామాల అభివృద్ధి గురించి చెప్పిన కొరటాల.. 'జనతాగ్యారేజ్'లో మొక్కలు, పర్యావరణం ఆవశ్యకతను వివరించారు. ఇక ఇటీవలే 'భరత్ అనే నేను' చిత్రంలో రాజకీయ నాయకులు గురించి ప్రస్తావించారు. ఇలా తన సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక అంశాలను టచ్ చేసిన కొరటాల ఈ సారి మాత్రం అటవీ భూముల పరిరక్షణ అనే అంశాన్ని టచ్ చేయబోతున్నట్లు తెలిసింది.
ఓ మాజీ నక్సలైట్ అటవీ భూముల పరిరక్షణపై చేసే పోరాటం ఆధారంగా సినిమా రన్ అవుతుందట. ఇటీవలే లీక్ అయిన చిరంజీవి లుక్ ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు 'ఆచార్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











