ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: చరణ్ సెలెక్ట్ చేసింది వద్దన్న చిరంజీవి.. ఒక్క సూచనతో పక్కన పెట్టేశారు.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వారిలో తండ్రీ కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ పేర్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరు పదుల వయసులోనూ చిరు కుర్రాళ్లతో పోటీ పడుతుంటే.. చెర్రీ మాత్రం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇటీవల వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమా వచ్చింది. దీని ఫలితం ఎలా ఉన్న ఇటు చిరంజీవి గానీ, అటు చరణ్ గానీ నిరాశ చెందలేదు. పైగా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. తాజాగా ఈ ఫాదర్ అండ్ సన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

తండ్రి కోసం రిస్క్ చేసినా ఫలితం దక్కలేదు
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని రామ్ చరణే నిర్మించాడు. తండ్రి కోసం అతడు భారీగా రిస్క్ చేశాడు. దీంతో ఎన్నో అంచాల నడమ విడుదలైన ఈ ప్రతిష్టాత్మక చిత్రం.. వాటిని అందుకోలేకపోయింది. ఫలితంగా నష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది.

బడా డైరెక్టర్ చేతిలో బాధ్యతలు పెట్టిన చెర్రీ
తన తండ్రికి మరిచిపోలేని సినిమాను ఇవ్వాలనుకున్న చరణ్‌కు ‘సైరా' నిరాశను మిగిల్చింది. దీంతో టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివకు చిరంజీవితో సెట్ చేశాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న చరణ్.. కొరటాలకే అన్ని బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి ఆయన సినిమాపైనే దృష్టి సారించారని తెలుస్తోంది.

హిట్ కోసం పట్టుదలతో పని చేస్తున్నారు
ఈ సినిమా హిట్ మెగాస్టార్‌కు బాగా అవసరం. గత చిత్రం తాలూకు లోటును పూడ్చడానికి ఆయన బాగా శ్రమిస్తున్నారట. ఇందులో భాగంగానే ఫిజిక్‌ను మెరుగుపరుచుకునేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. అదే సమయంలో కొరటాల కూడా తనపై ఉన్న నమ్మకాన్ని వొమ్ము చేయకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
రికార్డులు బద్దలు కొట్టేస్తున్న మెగాస్టార్
కొరటాల శివతో చేయబోతున్న సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి భారీగా చార్జ్ చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను చరణ్‌తో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దీంతో చిరు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఇందుకు గానూ ఆయన మొత్తంగా రూ. 50 కోట్లు వసూలు చేస్తున్నారని టాక్.

చరణ్ సెలెక్ట్ చేసింది మార్చేశారు
ఈ సినిమా.. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే దీనికి ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ పెట్టారని అనుకున్నారు. దీనిని చరణే సెలెక్ట్ చేశాడన్న టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్ మార్చారని అంటున్నారు. చిత్ర యూనిట్ గురువారం చేసిన ట్వీట్‌లో పేరు లేకపోవడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.

చిరంజీవి సూచనతోనే ఇలా జరిగింది
మొదట ఈ సినిమాకు ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ ప్రకటించారు. ఆ తర్వాత దీనికి ‘గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ పెడుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, కథకు అనుగుణంగా మొదట అనుకున్న దానిని మార్చమని చిరునే కొరటాలకు సూచించాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. దీంతో చరణ్ రిజిస్టర్ చేయించిన ఆ టైటిల్ మారిపోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











