చిరంజీవి బ్యాంకాక్ టూర్ సీక్రెట్.. ఆ ఇద్దరితో కలిసి అక్కడే సిట్టింగ్స్!

ఇటీవలే ప్రతిష్టాత్మక మూవీ 'సైరా నరసింహా రెడ్డి'తో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి సినిమా కోసం రెడీ అయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మలతో కలిసి ఆయన బ్యాంకాక్ టూర్ వేశారని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

మెగా 152.. కొరటాల సెట్స్‌పై చిరు

మెగా 152.. కొరటాల సెట్స్‌పై చిరు


మెగా 152 సినిమా కోసం కొరటాల శివ సెట్స్ పైకి రానున్నారు చిరంజీవి. సామాజిక అంశాలను ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన కొరటాల శివ.. ఈ సినిమా కోసం బలమైన, ఆసక్తికరమైన కథాంశంతో స్క్రిప్ట్ రెడీ చేశారట. నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

 రెగ్యులర్ షూట్‌కి ముహూర్తం

రెగ్యులర్ షూట్‌కి ముహూర్తం

తాజా సమాచారం మేరకు మెగా 152 డిసెంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూట్‌కి వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తికాగానే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే వేసవికల్లా సినిమాను ప్రేక్షకుల ముందుంచాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

బ్యాంకాక్‌లో ఆ ఇద్దరితో చిరు సిట్టింగ్స్

బ్యాంకాక్‌లో ఆ ఇద్దరితో చిరు సిట్టింగ్స్

అయితే ఈ సినిమా పనుల నిమిత్తం డైరెక్టర్ కొరటాల శివ, మణిశర్మలతో కలిసి బ్యాంకాక్ వెళ్లారట చిరంజీవి. మెగా 152 సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ బ్యాంకాక్‌లో జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. ఆ ఇద్దరితో పాటు చిరనేజీవి కూడా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగమై తన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
టైటిల్‌పై డిసీజన్ ఏంటంటే

టైటిల్‌పై డిసీజన్ ఏంటంటే

ఇక మెగా 152 సినిమా టైటిల్ విషయమై ఎప్పటినుంచో వార్తల్లో వినిపిస్తున్న పేరు 'గోవింద ఆచార్య'. కానీ ఈ మధ్యకాలంలోనే 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే కథ రీత్యా ఇదే టైటిల్ సినిమాకు బాగా యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట కొరటాల. ఈ మేరకు 'గోవిందా హరి గోవిందా' టైటిల్‌నే ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

 దేవాలయాల నేపథ్యం.. చిరు కెరీర్ లోనే స్పెషల్

దేవాలయాల నేపథ్యం.. చిరు కెరీర్ లోనే స్పెషల్

ఈ సినిమా కథాంశం దేవాలయాల నేపథ్యంలో ఉండనుందని సమాచారం. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే ఆఫీసర్‌గా చిరు నటించబోతున్నారట. అందుకే స్టైలిష్ లుక్ కోసం ప్రస్తుతం చిరంజీవి కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. చిరు కెరీర్ లోనే స్పెషల్ మూవీగా ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X