ఉగాదికి ఫిక్స్.. చిరంజీవి- కొరటాల మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

చిరంజీవి- కొరటాల మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై మెగా అభిమానుల్లో ఆత్రుత మొదలైంది. మూవీ అప్‌డేట్స్ కోసం చాలా కుతూహలంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో చిత్ర ఫస్ట్‌లుక్ గురించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఆచార్య అనే టైటిల్ పరిశీలనలో పెట్టిన దర్శకనిర్మాతలు ఉగాది కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Chiranjeevi- Koratala Siva movie update On First Look

చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండగా, మహేష్ బాబు స్పెషల్ రోల్ చేస్తున్నారు. రెజీనా స్పెషల్ సాంగ్ తో ఉర్రూతలూగించబోతోంది. దేవ‌దాయ భూముల ప‌రిర‌క్ష‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాక్. ఇందులో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో నటిస్తున్నారని తెలుస్తోంది. అతిత్వరలో మహేష్ బాబు కూడా ఈ మూవీ సెట్స్ మీదకు రానున్నారట. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X