మెగాస్టార్ నిర్ణ‌యం అదేనా..? ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి పూర్తికావడంతో అందరి చూపు మెగా 152 సినిమా అప్‌డేట్స్ పై పడింది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించనుండటంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఒక్క చిరంజీవి హీరో అనేది తప్పితే ఈ సినిమాకు సంబంధించి ఇతర చిత్ర యూనిట్ వివరాలు ఇంకా ప్రకటించబడలేదు. అయితే తాజాగా వస్తున్న మీడియా కథనాలు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి.

ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాకు అమిత్ త్రివేదియే సంగీతం అందించారు. అయితే అమిత్ త్రివేది బాణీలు, వ‌ర్కింగ్ స్టైల్‌ తెగ నచ్చేశాయట మెగాస్టార్ చిరంజీవికి. ఈ నేపథ్యంలో కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయబోయే తన తర్వాతి సినిమాకు కూడా అమిత్ త్రివేదికే సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలని మెగాస్టార్ భావిస్తున్నారట. అయితే ఇప్పటిదాకా కొరటాల చేసిన అన్ని సినిమాలకు దేవి శ్రీ సంగీతం అందించారు. మరి ఈ సినిమా విషయంలో ఆ ఛాన్స్ అమిత్ త్రివేది కోటయనున్నాడా? అనేది ఆసక్తికర అంశంగా మారింది.

Chiranjeevi- Koratala Sivas Movie Music Director

సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ఆలస్యమవడం కారణంగా కొరటాల- చిరంజీవి ప్రాజెక్టు ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి పూర్తికావడంతో కొరటాల శివ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల సినిమాలో స్పెషల్ లుక్‌లో దర్శనమీయనున్నారట చిరు. ఈ మేరకు కాస్త బరువు తగ్గేందుకు గాను బాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ సమక్షంలో చిరు కసరత్తులు చేస్తున్నారట. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు కొరటాల శివ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X