మెగా బ్రదర్స్ ఇస్తున్న చీవాట్లో తో ‘ఆరెంజ్’ డైరెక్టర్ కి వాచిపోతోంది...
ఇటీవలకాలంలో ప్రతి పెద్ద చిత్రం విడుదలకు ముందు ఏదో ఒక పెద్ద వివాదం పుట్టుకు రావడం సర్వ సాధారణమైపోయింది. ఏ వివాదం లేకుండా ఏ భారీ బడ్జెట్ చిత్రమూ విడుదల కావడం లేదు. ఈ కోవలోనే రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం 'ఆరెంజ్'కు బడ్జెట్ వివాదం మొదలైంది. 'మగధీర' రేంజ్‌లో 'ఆరెంజ్' చిత్రానికి ఖర్చు పెట్టించేసాడంటూ చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌పై చిరంజీవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
మగధీర సూపర్ హిట్ తర్వాత సూపర్ ప్లాప్ అయిన రామ్ చరణ్ తేజ్ చిత్రం 'ఆరెంజ్' అని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు. బాక్సీఫీసు వద్ద బోర్లాపడటంతో మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడిపై చిర్రెత్తిపోయడట. దర్శకుడు భాస్కర్ ను పిలిచి చెడామడా తిట్టి పారేశాడట. సినిమా తీయడం చేతకాకపోతే చేతులు ముడుచుకొని ఇంట్లో కూచోవాలి కానీ, ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు జాగ్రత్తగా తెరకెక్కించకపోతే నిర్మాత ఏమైపోతాడో ఆలోచించావా...? హీరో భవిష్యత్ ఏమైపోతుంది..? అంటూ నేరుగా ప్రశ్నించాడట. అది చాలక అతడిని ఇంటికి తీసుకవెళ్లి పర్సనల్ గా చాలా సేపు క్లాసు పీకాడట.
చిరు చేత క్లాసు పీకించుకున్న భాస్కర్ మాత్రం తనను ఎవరూ ఏమీ అన్లేదన్నట్లుగా కారెక్కి తనదారిన తను వెళ్లిపోయడట. పైపెచ్చు చిరు క్లాస్ నిజమేనా..? అని అడిగితే.. ఎవరికీ..? మీకా..? అని రివర్స్ గేర్ వేస్తున్నాడట. పాపం ఇంకేంచేస్తాడు, అటు నాగబాబు డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకుతుంటే, చిరంజీవి డైరెక్ట్ గా క్లాస్ పీకడంతో పాపం డైరక్టర్ ఇదంతా నా బ్యాడ్ టైమ్ అనుకొని తాపీగా వెళుతున్నాడట.


Click it and Unblock the Notifications











