రామ్ గోపాల్ వర్మను నవ్వుతూ తీసిపారేసిన చిరంజీవి
రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా చిరంజీవితో సినిమా చేస్తానని, దాని టైటిల్ దొర..ది లార్డ్ అంటూ సెటైర్స్ వేసాడు. చిరు క్యాంప్ నుంచి రెస్పాన్స్ ఏమీ రాకపోవటంతో మరో నాలుగు రోజులుకు రామ్ చరణ్ కన్నా, పవన్ కళ్యాణ్ కన్నా చిరంజీవే స్లిమ్ గా అందంగా ఉన్నాడని రెచ్చగొట్టాడు. ఇక చాలదన్నట్లు చిరంజీవి 150 వ చిత్రాన్ని ఆయనే డైరక్ట్ చేసుకోవాలంటూ పురి ఎక్కించాడు. ఇంక ఎవరు చేసినా చిత్రం చూడబుద్ది కాదని, 149 చిత్రాలలో నటించిన ఆయనకు డైరక్షన్ అనేది చాలా ఈజీ అవుతుందని ట్వీట్ చేసాడు. అయితే చిరంజీవి ఇవేమీ పట్టించుకోలేదు. రెండు మూడు చోట్ల మీడియా వారు ఆ ప్రశ్నలు లేవనెత్తితే తెలివిగా దాటేసాడు కానీ కామెంట్ చేయలేదు. దాంతో చిరు అభిమానులైన కొందరు ఆయన్ని పర్శనల్ గా కలిసి ఈ విషయమై కదిపారుట. దానికి చిరంజీవి నవ్వి..వర్మని పట్టించుకోవాల్సిన పనిలేదని, అతని ట్విట్టర్ లో రాసేవి రెచ్చగొట్టేవే అయినా సమాధానమిస్తే వాటిని లెక్కవేసినట్లు అవుతుందని,కాబట్టి మీరు కూడా ఆ విషయంలో కలగచేసుకోవటం అనవసరమని పెద్ద మనిషి తరహాలో నవ్వుతూ తీసిపారేసాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











