Mega 158: చిరంజీవి మూవీలో కన్నప్ప బ్యూటీ.. బాబీ ప్లాన్ ఏంటీ?

Chiranjeevi Mega 158: మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. మన శంకర వరప్రసాద్ గారు విజయంతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. ఈ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 'విశ్వంభర' రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, తన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లీ (Bobby Kolli)తో మరో భారీ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి చివరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ప్లాన్ ఉన్నట్లు టాక్.

చిరంజీవి-బాబీ సినిమాలో మరోసారి ఓ కీలక గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తున్నారట. గతంలో 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ దగ్గుపాటి స్పెషల్ అప్పియరెన్స్ ఎంత హైప్ తెచ్చిందో తెలిసిందే. అదే తరహాలో మెగా 158లో కూడా సెకండ్ హాఫ్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఓ యంగ్ హీరో కీలకంగా కనిపించబోతున్నాడని టాక్. మొదట తమిళ హీరో కార్తీ (Karthi) పేరు వినిపించినా, ఇప్పుడు తెలుగు యంగ్ హీరోనే తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ ఉందట. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఉంటుందని సమాచారం.

Chiranjeevi Mega 158 Latest Buzz Preity Mukundan Finalized as Daughter Bobby Kolli Film Cast

ఇక ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్, క్యాస్టింగ్, ప్రొడక్షన్ డీటైల్స్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ప్రియమణి (Priyamani)పేరు వినిపిస్తుండగా, కీలక పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కనిపించే అవకాశముందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే ఈ భారీ చిత్రానికి లెజెండరీ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా లాక్ చేయాలనే ప్లాన్ జరుగుతోందని సమాచారం. మ్యూజిక్ విషయంలో కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. నిర్మాణ బాధ్యతలు కేవీఎన్ ప్రొడషన్స్ చేపట్టనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉండగా, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

చిరు కూతురు పాత్రలో ఎవరు?
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక ఎమోషనల్, పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని టాక్. కథలో తండ్రీ-కూతుళ్ల సెంటిమెంట్‌కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీలకమైన డాటర్ రోల్ కోసం మొదట సారా అర్జున్, అనస్వర రాజన్, కీర్తి సురేష్ వంటి పేర్లు వినిపించాయి. అయితే తాజా బజ్ ప్రకారం 'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకందన్ (Preity mukhundhan) పేరే ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రీతీ ముకుందన్ టాలీవుడ్‌లో 'కన్నప్ప' సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ పాన్ ఇండియా సినిమాలో ఆమె 'నెమలి' అనే పాత్రలో కనిపించి తనవంతు ప్రయత్నం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ప్రీతీకి రావాల్సిన గుర్తింపు రాలేదు. అయితే.. తన క్యూట్ లుక్స్‌తో పాటు, ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలదనే నమ్మకంతో బాబీ ఈమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఒక వేళ.. ఈ సినిమా సెట్ అయితే.. ప్రీతి ముకుందన్ కెరీర్ మలుపుతిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు మెగాస్టార్ సినిమాలో కీలక పాత్ర, మరోవైపు రోషన్ మేకాతో కలిసి శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఏమో ఏమో ఇది' సినిమా కూడా ఆమెకే దక్కింది. రెండు పెద్ద బ్యానర్లలో కీలక పాత్రలు అంటే కెరీర్ టర్నింగ్ పాయింట్ అన్న మాట. ఈ వార్తపై అధికారిక అనౌన్స్‌మెంట్ వస్తే కానీ పూర్తి క్లారిటీ రాదు. అప్పటివరకు ఈ మెగా బజ్‌పై ఫ్యాన్స్ వెయిటింగ్ గేమ్ ఆడాల్సిందే!

More from Filmibeat

Read more about: bobby kolli chiranjeevi preity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X