శత్రువులిద్దరిదీ ఒకే మాట...ఒకే బాట!
జనాలు వారిద్దరినీ శత్రువులుగానే చూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలోకి వస్తారు. అవకాశం వస్తే ఒకర్ని ఒకరు విమర్మించుకోవడం వారి హాబీ. దీంతో జనాలు వారిద్దరినీ ఉత్తర, దక్షిణ దృవాలుగా చూశారు. ఈ ఇద్దరే పద్మభూషణ్ చిరంజీవి, పద్మ శ్రీ మోహన్ బాబు. ప్రస్తుతం వారిద్దరిదీ ఒకే మాట! ఒకే బాట. ఒకే మాటా? అదే సమైక్యాంధ్ర మాట..పోరు బాట.
సమైక్యాంధ్ర నినాదంతో చిరంజీవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మోహన్ బాబు ఇటీవలే విడుదలైన తన తనయుడి సినిమా 'సలీం" ను ఖాతరు చేయకుండా...నష్టమొచ్చినా ఫర్వాలేదు..సమైక్యాంధ్రానే ముద్దు అంటున్నారు. ఉద్యమ విషయంలో ఇరువురూ ఒకే మాటపై నిలబడినా , ఒకే దారిలో వెళ్తున్నా చేయీ, చేయీ కలిపి నడిచే రోజు ఎప్పుడొస్తుందో మరి!


Click it and Unblock the Notifications











