చిరంజీవితో మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్.. టాలీవుడ్ ఐకానిక్ సాంగ్ రీమేక్‌తో..!
మెగాస్టార్ చిరంజీవి తన నుంచి రాబోయే చిత్రాల కోసం ప్రత్యేక శ్రద్ద వహించారు. చివరిగా మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వంటి చిత్రాలతో అలరించారు. ఇక నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వింటేజ్ చిరంజీవిని చూపించే ప్రయత్నంలో భాగంగా భారీ ఫాంటసీ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ ముగించుకుంటోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పార్లర్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
చాలా స్పెషల్ గా విశ్వంభర సినిమా..
బింబిసార చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన మల్దిడి వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో చిత్రీకరిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా సౌత్ క్వీన్, సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటిస్తుండటం విశేషం. జగదేక వీరుడు అతిలోక సుందరి, కీలు గుర్రం, పాతాళ భైరవి వంటి చిత్రాల నుంచి స్ఫూర్తి పొందారు. అయితే ఈ చిత్రం తర్వాత చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. భారీ విజువల్స్ తో 14 లోకాల్లో హీరోయిన్ కోసం హీరో వెతికే కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

స్పెషల్ సాంగ్ లో మౌనీ రాయ్..
విశ్వంభర చిత్రంలో ఇప్పటికే చాలా స్పెషల్ ఎలిమెంట్స్ ను, సర్ ప్రైజింగ్ అంశాలను దాచి పెట్టారు దర్శక నిర్మాతలు. చిరు వింటేజ్ లుక్, భారీ విజువల్స్ ద్వారా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ క్రమంలో విశ్వంభర చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, నాగిని సీరియల్ ఫేమ్ మౌనీ రాయ్ తో స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ ఫిల్మ్ లోని ఎవర్ గ్రీన్ సాంగ్ రగులుతోంది మొగలిపొద అనే సాంగ్ ను రీమిక్స్ చేయబోతున్నారంట. ఇది మెగా అభిమానులకు ప్రత్యేక బహుమతి అనే చెప్పాలి.
నాగిని సీరియల్ తో ఫేమ్..
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ నాగిని సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఇక బ్రహ్మాస్త్రం చిత్రంలోనూ నెగెటివ్ రోల్ లో నటించి సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అటు హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక చిరంజీవితో స్పెషల్ సాంగ్ తర్వాత మౌనీకి టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.
విశ్వంభర చిత్రం బడ్జెట్..
విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. స్టార్ కాస్ట్, భారీ విజువల్స్, రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులతో సినిమాకు భారీగానే ఖర్చైందని తెలుస్తోంది. దీంతో రూ.200 కోట్ల వరకు బడ్జెట్ ను వెచ్చించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 2025 సెప్టెంబర్ 18 లేక 2025సెప్టెంబర్ 25న విశ్వంభర చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథన్, ఇషా చావ్లా హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











