చిరంజీవి 150వ చిత్రానికి జగన్ అడ్డుకాబోతున్నారా?
రామ్ చరణ్ తేజ నిన్న (మంగళవారం) తిరుమల తిరుపతి దేవస్ధానం లో వెంకన్నను దర్శించి తోమాల సేవలో పాల్గొన్నారు. అప్పుడు తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూంటే చిరంజీవి 150 సినిమా ప్రస్దావన వచ్చింది. దానికి స్పందిస్తూ...సినిమా 2011 లో రిలీజ్ అవచ్చు కానీ నేను ష్యూర్ గా చెప్పలేను అన్నారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ వర్గాలు కూడా చిరంజీవి ఇప్పుడున్న పార్టీ పనులు కొనసాగిస్తూ వెళితే 2011 సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయటం సాధ్యమయ్యే పని కాదంటున్నారు. అందుకు కారణంగా జగన్..కాంగ్రేస్ నుంచి బయిటకు వచ్చి పార్టీ పెడితే..తమ పార్టీకి పనులు పెరుగతాయని,తమ ఎమ్మల్యేలు గవర్నమెంట్ కు సపోర్ట్ ఇవ్వాల్సి వస్తోందని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తాము సినిమా కష్టమంటున్నామని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ఇప్పటికీ చిరుని డైరక్ట్ చేసేది ఎవరన్నది తేలలేదు. అధినాయకుడు టైటిల్ తో రకరకాల ఊహాగానాలు వినపడుతున్నప్పటికీ కథ ఇంకా ఫైనలైజ్ కాలేదని విశ్వసనీయ సమాచారం. మరో ప్రక్క చిరంజీవి చిత్రానికి బోయపాటి శ్రీనుని దర్శకుడుగా ఎంపిక చేసారని వినపడుతోంది. అలాగే తన కొత్త చిత్రం వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని చిరంజీవి ఇటీవలే చెప్పారు. ఆ కొత్త చిత్రం ఠాగూర్ చిత్రంలా ఉంటుందని, మానవీయ కోణంలోనే ఈ చిత్రం ఉంటుందన్నారు. నెలకు పదిరోజులు చిత్రం చిత్రీకరణలో పాల్గొంటానని చెప్పారు. కాగా 90 శాతం చిత్రం ఆంద్రప్రదేశ్ లోనే చిత్రీకరిస్తామని చెప్పారు. ఇది నిజం అవుతుందా..కాదా అన్నది త్వరలోనే తేలనుంది.


Click it and Unblock the Notifications











