200 కోట్ల డైరెక్టర్‌తో చిరంజీవి: పాన్ ఇండియా రేంజ్‌లో.. ఆ బ్యాగ్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్‌గా!
సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే చిత్రంతో హీరోగా అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో వరుసగా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి అలరించారు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ జోష్‌లోనే చిరంజీవి వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఓ మలయాళ డైరెక్టర్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఎవరతను? వివరాల్లోకి వెళ్తే...
'భోళా శంకర్'గా చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాను చేస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇది ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు 11న విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే వేగంగా పని చేస్తున్నారు.

వాళ్లతో మూవీ అనుకుంటే: చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుల కోసం కథలను వింటూనే వచ్చారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్లతో చిరు మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వెంకీ కుడుముల, బాబీ, వీవీ వినాయక్, పూరీ జగన్నాథ్ సహా పలువురి కథలను ఆయన రిజెక్ట్ చేశారని అన్నారు.

ఆ డైరెక్టర్లతో చిరు మూవీలు: ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టు చేసేందుకు సిగ్నల్ ఇచ్చారు. అలాగే, 'బింబిసార' ఫేం వశిష్టతో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. వీటికి సంబంధించిన ప్రకటనలు అతి త్వరలోనే రాబోతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మలయాళ డైరెక్టర్‌తో మూవీ: ఇప్పటికే కల్యాణ్ కృష్ణ, మల్లిడి వశిష్టల కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా మరో డైరెక్టర్‌తో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఆయన మరెవరో కాదు.. ఇటీవలే మలయాళలో విడుదలై.. ఏకంగా రూ. 200 కోట్లు గ్రాస్‌తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న '2018' మూవీని తెరకెక్కించిన జూడ్ ఆంథోనీ జోసెఫ్ అని తెలిసింది.

నేచురల్ స్టోరీకి పడిపోయి: మలయాళంలో రూపొందిన '2018' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దీంతో ఇక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇక, ఈ మూవీని చూసిన వెంటనే దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్‌ను చిరంజీవి అభినందించారట. అంతేకాదు, ఆయన హైదరాబాద్ వచ్చిన సమయంలోనే ఓ లైన్‌ను మెగాస్టార్‌కు వినిపించినట్లు తెలిసింది.
ఆ సిటీ బ్యాగ్‌డ్రాప్‌తోనే: జూడ్ ఆంథోనీ జోసెఫ్ చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే పూర్తి స్క్రిప్టును రెడీ చేయమని చిరంజీవి ఆయనకు చెప్పారని తెలిసింది. దీంతో సదరు దర్శకుడు విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌తో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది. దీన్ని మరికొద్ది రోజుల్లోనే చిరంజీవికి వినిపించబోతున్నాడని సమాచారం. అది నచ్చితే వెంటనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.

ఆ రెండు సంస్థలు కలిసి: మెగాస్టార్ చిరంజీవి - జూడ్ ఆంథోనీ జోసెఫ్ కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్టును గీతా ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ను ఫిక్స్ చేస్తున్నట్లు కూడా సమాచారం.


Click it and Unblock the Notifications











