Chiru 157: సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో చిరంజీవి మూవీ.. మెగాస్టార్ కెరీర్‌లో మరో డిఫరెంట్ స్టోరీతో!

చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీని ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుసగా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి మెప్పించారు.

ఈ క్రమంలోనే గత సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఓ డిజాస్టర్‌ను సైతం చవి చూశారు. ఈ జోష్‌లోనే చిరంజీవి వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇలా ఇప్పుడు ఓ క్రేజీ డైరెక్టర్‌కు సిగ్నల్ ఇచ్చారు. ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే...

Chiranjeevi Movie With Bhagavanth Kesari Director Anil Ravipudi

భోళా శంకర్‌‌తో బిగ్ డిజాస్టర్: చిరంజీవి కొద్ది రోజుల క్రితమే 'భోళా శంకర్' మూవీతో వచ్చారు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ చిత్రం 'వేదాళం'కు రీమేక్‌గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా అనుకున్న విధంగా దక్కలేదు. ఫలితంగా భారీ నష్టాలతో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ అయింది.

Chiranjeevi Movie With Bhagavanth Kesari Director Anil Ravipudi

కల్యాణ్ కృష్ణతో క్యాన్సిల్: రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. 'బంగార్రాజు' డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో ఓ ప్రాజెక్టుకు సిగ్నల్ ఇచ్చారు. దీన్ని మెగా డాటర్ సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తుందని ప్రకటించారు. అయితే, ఈ సినిమాను అనివార్య కారణాలతో ఆపేశారు. దీనికి కారణం రీమేక్‌కు చిరంజీవి దూరంగా ఉండాలని డిసైడ్ అవడమే.

Chiranjeevi Movie With Bhagavanth Kesari Director Anil Ravipudi

వశిష్టతో చిరంజీవి మూవీ: కల్యాణ్ కృష్ణతో ప్రాజెక్టు క్యాన్సిల్ అవడంతో చిరంజీవి తన 156వ చిత్రాన్ని 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో చేస్తున్నారు. ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే. దీన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూ. 200 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Chiranjeevi Movie With Bhagavanth Kesari Director Anil Ravipudi

అనిల్ రావిపూడితో ఫిల్మ్: ఇప్పటికే మల్లిడి వశిష్టతో క్రేజీ సినిమాను చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా మరో డైరెక్టర్‌తో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఆయన మరెవరో కాదు.. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' మూవీని తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి అని తెలిసింది. ఈ దర్శకుడు చెప్పిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Chiranjeevi Movie With Bhagavanth Kesari Director Anil Ravipudi

అలాంటి కథ.. దిల్ రాజు: మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా కోసం అనిల్ రావిపూడి ఔట్ అండ్ ఔట్ కామెడీ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది. దీన్ని 'చంటబ్బాయి' తరహాలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక కథతో తెరకెక్కించబోతున్నారట. ఇందులో చిరంజీవి రోల్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని తెలిసింది. ఇక, ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నారని కూడా న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X