చిరంజీవి కొత్త సినిమా డైరెక్టర్ ఫిక్స్.. కూతురితో కలిసి అలాంటి కథకు గ్రీన్ సిగ్నల్

చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అదిరిపోయే రీఎంట్రీని ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో వరుసగా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి మెప్పించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఆయన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ చిత్రం 'విశ్వంభర'ను 'బింబిసార' దర్శకుడు మల్లిడి వశిష్టతో చేస్తున్నారు. ఈ సినిమాను సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేసిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు.

Chiranjeevi Movie With God Father Director Mohan Raja

ఇప్పటికే మల్లిడి వశిష్టతో క్రేజీ సినిమాను చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా మరో డైరెక్టర్‌తో సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఆయన మరెవరో కాదు.. గతంలో చిరంజీవితోనే 'గాడ్ ఫాదర్' మూవీని తెరకెక్కించిన మోహన్ రాజా అని తెలిసింది. ఈ దర్శకుడు ఇటీవలే ఆయనను కలిసి చెప్పిన కథకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిలిం నగర్ ఏరియా సమాచారం.

మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా కోసం మోహన్ రాజా ఔట్ అండ్ ఔట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేసినట్లు తెలిసింది. దీన్ని హై రేంజ్ బడ్జెట్‌తో తెరకెక్కించేలా ప్లాన్లు కూడా చేసుకున్నారని తాజాగా తెలిసింది. ఇందులో చిరంజీవి రోల్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని తెలిసింది. దీంతో ఈ కాంబినేషన్‌పై అప్పుడే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడుతున్నాయి.

Chiranjeevi Movie With God Father Director Mohan Raja

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న ప్రాజెక్టును పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జూన్ నెలలోనే రాబోతుందని అంటున్నారు. అంతేకాదు, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్‌ను ఆగస్టు నుంచి మొదలు పెడతారనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. హై రేంజ్ యాక్షన్‌తో రాబోయే ఈ చిత్రాన్ని దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X