మంచు గొడవల్లోకి మెగాస్టార్ పేరు .. సంబంధం లేకపోయినా బద్నామ్ చేసే యత్నం?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న అంశాల్లో మంచు వారి కుటుంబ గొడవలు కూడా ఒకటి అని చెప్పాలి. ఈ గొడవల్లో మంచు కుటుంబీకులు ఒక్కోక్కరు ఒకోలా ప్రవర్తిస్తుండగా రోజుకొక ఇంట్రస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. మెయిన్ గా మంచు మనోజ్ ని తమ కుటుంబం నుంచి వేరేగా చూపిస్తూ ఆస్తుల విషయంలో తనకి తన కుటుంబానికి కూడా జరుగుతున్న ఇబ్బందులు ఇతర పలు షాకింగ్ అంశాలను మనోజ్ షేర్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

అక్కడి నుంచి తన తండ్రి మోహన్ బాబు , అన్న మంచు విష్ణు ఎంట్రీతో పరిస్థితులు మరింత రసవత్తరంగా మారాయి. దీనితో వీరి కుటుంబంలో గొడవలు విషయం అంతా తెలుగు రాష్ట్రాల్లో మరో న్యూస్ లేదు అన్నట్టుగా కూడా మీడియా వారు ప్రసారం చేస్తున్నరు. మధ్యలో మీడియా వారిపై మోహన్ బాబు చేసిన దాడిని కూడా వారు ఖండించిన సంగతి తెలిసిందే.

chiranjeevi name involving in manchu family controversy

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వారి గొడవల్లోకి అసలు సంబంధమే లేని మెగాస్టార్ చిరంజీవి పేరుని తీసుకొచ్చి కొన్ని మీడియా సంస్థలు మరింత మైలేజి పెంచుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. దీనితో చిరు పేరుని తీసుకురావడంపై మెగా ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు సంబంధమే లేని మంచు వారి గొడవల్లోకి చిరు పేరు తీసుకురావడం పూర్తిగా అసందర్భం అంటూ తాను సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

చిరంజీవి విషయంలో మోహన్ బాబు పలు సందర్భాల్లో అది కూడా సినిమాల పరంగా అసహనం వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది కాకుండా చిరు రాజకీయాల్లో ఉన్నపుడు మోహన్ బాబు చిరంజీవిని టార్గెట్ చేశారనే పలు రూమర్స్ ఉన్నాయి. కానీ పర్శనల్ లైఫ్ పరంగా చిరంజీవి హద్దులు దాటిన సందర్భాలు చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఇన్నేళ్ళలో చిరంజీవిని ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేసినప్పటికీ మెగాస్టార్ మాత్రం క్షమించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కానీ ఇలా మంచు వారి ఇంట పర్సనల్ గొడవలు జరుగుతుంటే కొన్ని మీడియా సంస్థల వారు కావాలని అసలు సంబంధం లేకపోయినా చిరంజీవి పేరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తనని బద్నామ్ చేసే ప్రయత్నమే అంటూ ఎస్‌కేఎన్ సహా అభిమానులు కూడా మండిపడుతున్నారు. దీనితో మంచు కుటుంబపు వార్‌లో మెగాస్టార్ పేరు ప్రస్తావనకు రావడం జరుగుతుంది.

మరి ఈ హైడ్రామా అంతా ఎక్కడ ఎలా ఆగుతుందో అనే దానిని చాలా మంది ఉత్కంఠగా గమనిస్తున్నారు. చూడాలి మరి వీరి గొడవలకి ఎలాంటి ఎండ్ కార్డు పడుతుంది అనేది. కాగా ఇపుడు మెగాస్టార్ చిరంజీవి భారీ చిత్రం "విశ్వంభర"లో బిజీగా ఉన్నారు. మోహన్ బాబు మాత్రం నాచురల్ స్టార్ నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన భారీ చిత్రం ది ప్యారడైజ్ లో నటిస్తున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X