'నాయక్' చిత్రం రిపేర్లు చేస్తున్న చిరంజీవి?

By Srikanya

హైదరాబాద్ : రామ్ చరణ్,వివి వినాయిక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'నాయక్' . ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం రఫ్ ఎడిటింగ్ వెర్షన్ చూసిన చిరంజీవి ప్రస్తుతం కొన్ని సూచనలను తెలియచేసినట్లు సమాచారం. ఈ మేరకు వినాయిక్ కి దగ్గరుండి రిపేర్లు చేయించాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

మొన్న సోమావారం రాత్రి అందరూ న్యూ ఇయిర్ హడావిడిలో ఉండగా చిరంజీవి మాత్రం నిర్మాత దానయ్య ఆఫీస్ లో ఈ చిత్రం గురించి సమీక్షించారని చెప్తున్నారు. అందుకోసం టెక్నిషియన్స్ అక్కడ వేచి ఉండి ఆయన చెప్పి కీలకమైన సూచనలు తీసుకుని సినిమాను మరింతగా మెరుగుపరిచే ప్రయత్నంలో పడ్డారని తెలుస్తోంది. ఇక గతంలోనూ చిరంజీవి రచ్చ విషయంలోనూ దగ్గరుండి పూర్తిగా చూసుకున్నారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. తన సుదీర్ఘ కాల నటనా అనుభవంతో చిరంజీవి ఈ తరహా మార్పులు చెప్పి సినిమాని ఫ్యాన్స్ కి నచ్చేలా తీర్చి దిద్దుతున్నాడని అంటున్నారు.

చిరంజీవితో 'ఠాగూర్‌'లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించిన తాజాచిత్రం 'నాయక్‌'. 'మగధీర' తర్వాత కాజల్‌ మరోసారి చెర్రీ సరసన జంట చేరగా, అమలాపాల్‌ కొత్తగా ఆడిపాడింది. జనవరి 11న థియేటర్లలో సందడి చేయనుంది. దీనిని తమిళ ప్రేక్షకుల చెంతకు తీసుకొచ్చేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఆడియో విడుదలైన మరుసటి రోజే తమిళ 'నాయక్‌'కు సంబంధించిన వాల్ పోస్టర్లు చెన్నై నగరమంతా వెలిసి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

రామ్‌చరణ్‌ హీరోగా యూనివర్సల్‌ మీడియా సంస్థ 'నాయక్‌'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X