Chiru 156: మరో మలయాళం రీమేక్‌లో చిరంజీవి..యంగ్ హీరోతో కలిసి..ఇంతకీ ఏ సినిమా అంటే?
స్వయంకృషితో ఎదగడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పే హీరో చిరంజీవి. చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా, బాస్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల వరుస పెట్టి సినిమాలతో తెగ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం యువ దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టారు. అయితే చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల తర్వాత మళ్లీ మరో రీమేక్ సినిమాను చిరంజీవి చేయనున్నాడని టాక్ వస్తోంది.

వేదాళం రీమేక్: మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ఎక్కువగా రీమేక్ చిత్రాలే ఉంటున్నాయి. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం చిత్రానికి భోళా శంకర్ రీమేక్ అని టాక్ నడుస్తోంది.

టాక్సీ డ్రైవర్ గా: భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటిస్తోంది. అలాగే చిరుకి చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా కల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఇందులో టాక్సీ డ్రైవర్ గా చిరు అలరించనున్నారు.

డీజే టిల్లు హీరోగా: ఇప్పుడు తాజాగా యువ దర్శకుడితో చిరంజీవి సినిమా (Mega156) చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాలో చిరంజీవితోపాటు సిద్ధు జొన్నలగడ్డ మరో హీరోగా చేస్తున్నాడని వార్తలు విపరీతంగా వచ్చిన విషయం తెలిసిందే.

నిర్మాతగా చిరు కుమార్తె: కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి సినిమాను సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించనుంది. అంతేకాకుండా ఇందులో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. అయితే ఈ సినిమా మలయాళం మూవీ బ్రో డాడీకి రీమేక్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

జోడీగా శ్రీలీల: మలయాళ చిత్రం బ్రో డాడీలో తండ్రిగా మోహన్ లాల్ నటించగా.. ఆయనకు కొడుకు పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసాడు. ఇప్పుడు మరోసారి మోహాన్ లాల్ మూవీని చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ పాత్రలో తండ్రిగా చిరు నటించగా.. కొడుకు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తాడని టాక్. సిద్ధుకు జోడీగా శ్రీలీల చేయనుందట.

సీనియర్ హీరోయిన్ కోసం: ఇక ఒరిజనల్ బ్రో డాడీ సినిమాలో మోహన్ లాల్ కు జంటగా మీన ఆకట్టుకోగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కల్యాణి ప్రియదర్శని చేసింది. ఇప్పుడు సిద్దుుక జోడీగా శ్రీలీల ఫిక్స్ కాగా.. చిరంజీవికి ఒక సీనియర్ హీరోయిన్ ను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని తెలుగు నేటివిటీకి సరిగ్గా తీర్చి దిద్దనున్నారట.


Click it and Unblock the Notifications











