చిరంజీవి సినిమాలో మ‌రో యంగ్ హీరోయిన్.. బాబీ ప్లాన్ అదుర్స్!

సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు తో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తన స్టామినా ఏంటో నిరూపించారు. చాలా కాలం తర్వాత చిరంజీవికి భారీ కమర్షియల్ హిట్ దక్కడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సినిమా విజయం తర్వాత చిరు తన తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు బాబీ కొల్లి తో రెండోసారి సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ రూమర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరోసారి గెస్ట్ రోల్ ప్లాన్‌ను బాబీ డిజైన్ చేస్తున్నారట. గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారులో విక్టరీ వెంకటేష్ స్పెషల్ అప్పియరెన్స్ ఎంత హైప్ తెచ్చిందో తెలిసిందే. అదే తరహాలో చిరు-బాబీ సినిమాలో కూడా సెకండ్ హాఫ్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఓ యంగ్ హీరో కీలకంగా కనిపించబోతున్నాడని టాక్. తొలుత తమిళ హీరో కార్తీ పేరు వినిపించినా, ఇప్పుడు తెలుగు యంగ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో బాబీ ఉన్నారని సమాచారం. ఈ పాత్ర మొత్తం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఉండబోతుందట.

Chiranjeevi Next Movie with Bobby

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో ముఖ్యమైన హైలైట్‌గా యంగ్ హీరోయిన్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి కి ఈ సినిమాలో కీలక పాత్ర దక్కినట్లు టాక్. చిరంజీవికి జోడీగా కాకుండా, ఆయన కూతురు పాత్రలో కృతి కనిపించనున్నారని సమాచారం. తండ్రి-కూతురు భావోద్వేగ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే. చిరంజీవికి జోడీగా ప్రియమణి ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో కనిపించే అవకాశముందట. ఈ అంశంపై కూడా జోరుగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సంగీత దర్శకుడిగా లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.

ఇక చిరు - బాబీ కాంబో మూవీని కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో తెరకెక్కించనుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయని, ఫిబ్రవరి 2026లో అధికారిక పూజా కార్యక్రమాలతో సినిమా లాంచ్ అయి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. గతంలో వాల్తేర్ వీరయ్య తో చిరు-బాబీ కాంబినేషన్ పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య చర్చలు ఊపందుకున్నాయి. కృతి శెట్టి ఎంపికపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు కొత్త ఫ్రెష్ ట్విస్ట్ ఉండాలని కోరుతున్నారు. చిరంజీవి సినిమాల్లో తండ్రి-కూతురు సెంటిమెంట్ మరోసారి హృదయాలను తాకుతుందా? లేక బాబీ ఏదైనా కొత్త కోణంలో ఈ కథను చూపిస్తాడా? అన్నది అధికారిక ప్రకటనతో స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X