twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పోకడ మంది కాదు: రామ్ చరణ్ నిర్ణయంపై చిరంజీవి అసంతృప్తి?

    |

    మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. 'వినయ విధేయ రామ' సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించడానికి తన రెమ్యూనరేషన్ త్యాగం చేయడం ఆయనకు బొత్తిగా నచ్చలేదట. తాజాగా ఈ తరహా వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో, మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' గత నెల సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిలైన సంగతి తెలిసిందే. సినిమా పరాజయాన్ని అంగీకరిస్తూ, అభిమానులను క్షమాపణలు కోరుతూ రామ్ చరణ్ బహిరంగ లేఖ రాశారు.

    వినయ విధేయ రామ

    వినయ విధేయ రామ

    దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని రూ. 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అన్ని ఏరియాలకు కలిపి థియేట్రికల్ రైట్స్ రూ. 90 కోట్లకు అమ్మారు. సంక్రాంతికి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ నెగెటివ్ టాక్ రావడంతో తర్వాతి రోజు నుంచే కలెక్షన్స్ పడిపోవడం మొదలైంది.

    30 శాతం లాస్

    30 శాతం లాస్

    సినిమా ఫుల్‌రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 94 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందు రూ. 63 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు రూ. 27 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. వారి నష్టాలు పూడ్చడానికి రామ్ చరణ్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్లో కొంత త్యాగం చేశాడు.

    చిరంజీవికి నచ్చలేదా?

    చిరంజీవికి నచ్చలేదా?

    అయితే రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం చిరంజీవికి నచ్చలేదట. డిస్ట్రిబ్యూటర్లకు కేవలం 30 శాతం మాత్రమే నష్టం ఏర్పడింది. ఇది అంత పెద్ద నష్టం కానే కాదు. వ్యాపారంలో ఇలాంటివి సర్వసాధారణం. రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వడం అనే సంస్కృతి మొదలైతే మున్ముందు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారట.

    చిరంజీవి, రామ్ చరణ్

    చిరంజీవి, రామ్ చరణ్

    ప్రస్తుతం చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ‘సైరా నరసింహారెడ్డి' చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూనే రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్.

    English summary
    Ram Charan's decision for sacrificing his remuneration to compensate the loss suffered by the distributors of Vinaya Vidheya Rama, is not gone down well with his father Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X