Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
చిరంజీవి లుక్ టెస్ట్.. ఫైనల్ చేసిన కొరటాల.. రెగ్యులర్ షూట్ డేట్ ఫిక్స్!
ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో తన చిరకాల కోరిక తీర్చుకున్న చిరంజీవి.. ప్రస్తుతం తన 152వ ప్రాజెక్టు కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ఆలస్యమవుతూ వచ్చింది. కాగా తాజా సమాచారం మేరకు అన్నీ సిద్ధం చేసిన కొరటాల చిరు లుక్ కూడా టెస్ట్ చేసి రెగ్యులర్ షూట్ డేట్ ఫిక్స్ చేశారట. ఆ వివరాలు చూద్దామా..
వరుస హిట్స్.. ఇక చిరుపై కన్ను
వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు సాధించిన కొరటాల శివ ఇప్పుడు టాలీవుడ్ లో మరో హిట్‌పై కన్నేశారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేశారు. కమర్షియల్ సినిమాకు సామాజిక బాధ్యతను అద్ది సినిమా తీయడంలో దిట్ట అయినా ఈయన ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే.
చిరు లుక్ టెస్ట్.. రెగ్యులర్ షూట్
చిరంజీవితో చేయబోయే ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నారట కొరటాల. దేవాలయాల నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ ఉందని తెలిసింది. ఇక సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించనున్న ఆయన.. చిరుకి సంబంధించిన లుక్ టెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ టెస్ట్‌లో చిరు లుక్ కొరటాలకు నచ్చడంతో ఇక రెగ్యులర్ షూట్‌కి పచ్చ జెండా ఊపేశారట కొరటాల.
ఇవీ షెడ్యూల్ వివరాలు
చిరంజీవి లుక్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న కొరటాల శివ.. రెగ్యులర్ షూటింగ్‌ను జనవరి 3 నుండి మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఈ షెడ్యూల్లో చిరంజీవి ఇంట్రో సీన్స్, ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత సంక్రాంతికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టాలని కొరటాల స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మణిశర్మ సంగీతం, త్రిష రొమాన్స్
ఇక మెగాస్టార్ 152వ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కట్టనున్నారు. ఇప్పటికే మణిశర్మ ఈ సినిమాకు గాను మూడు సాంగ్స్ ను ఫైనల్ చేశారట. చిత్రంలో చిరంజీవి సరసన అందాల తార త్రిష ఆడిపాడనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమాన లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.