చిచ్చురేగింది: మెగా ఫ్యామిలీ సినిమాలకు ఎఫెక్ట్?

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి...తర్వాత ఆయన వారసత్వంతో తెలుగు తెరపై తిరుగులేని హీరోలుగు ఎదిగిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు ఈ స్థాయికి రావడానికి కారణం మెగా ఫ్యాన్స్ అని చెప్పక తప్పదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెగా అభిమానుల్లో చీలిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇకపై విడుదలయ్యే మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన సినిమాలు, ఆడియో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయంటే...దానికి అభిమానుల అండదండలు ఉన్నాయనేది కాదనలేని వాస్తవం. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు చిరంజీవి, ఇపుడు పవన్ కళ్యాణ్ నెం. 1 స్థానంలో కొనసాగుతున్నారంటే ఉన్నారంటే ఫ్యాన్స్ సపోర్ట్ ఉండబట్టే.

Chiranjeevi, Pawan Kalyan fans divided

అలాంటి ఫ్యాన్స్ విడిపోతే.....రెండు వర్గాలుగా ఏర్పడితే.... మెగా ఫ్యాన్స్ బలం తగ్గిపోవడం ఖాయం. తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు అలాంటి పరిణామాలనే సూచిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒకేతాటిపై నడిచిన చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 30 తిరుపతిలో చిరంజీవి, పవన్‌ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. 30న ఫ్యాన్స్‌డేగా జరపాలని నిర్ణయించామని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ రాజకీయ విధానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. అయితే చిరు సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామన్నారు. చిరు, పవన్, చెర్రీ, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు.

అయితే, స్వామి నాయుడు ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావద్దని పవన్ కళ్యాన్ అభిమాన సంఘం అధ్యక్షుడు కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమానులను కోరారు. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్‌ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్‌ తెలిపారు. మరి పరిణామాలు ఉలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X