»   »  చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... రూ. 65 కోట్లు, అంత సీన్ ఉందా?

చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... రూ. 65 కోట్లు, అంత సీన్ ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం భారీ విజయం సాధించడం.... రూ. 100 కోట్ల షేర్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో మెగా స్టార్ ఇమేజ్ ను, ఫాలోయింగ్ ను బేస్ చేసుకుని మరో భారీ సినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్న ఓ రూమర్ ఏమిటంటే... త్వరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ల ఓ మల్టీ స్టారర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతోందని...ఈ సినిమాను టి సుబ్బిరామిరెడ్డి, అశ్వినీదత్ కలిసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చిరంజీవి 150వ చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో సుబ్బిరామిరెడ్డి సన్మాన సభ ఏర్పాటు చేసి... చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుబ్బిరామిరెడ్డి ప్రకటనతో.... ఈ సినిమా గురించి హాట్ టాక్ ప్రారంభం అయింది.

 చిరు, పవన్, త్రివిక్రమ్.. రూ. 65 కోట్లు

చిరు, పవన్, త్రివిక్రమ్.. రూ. 65 కోట్లు

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ ముగ్గురికి రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇవ్వబోతున్నారట. చిరంజీవికి రూ. 25 కోట్లు, పవన్ కళ్యాణ్ కు రూ. 25 కోట్లు, త్రివిక్రమ్ కు రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇవ్వబోతున్నారట.

 మరి బడ్జెట్ ఎంత ఉంటుందో?

మరి బడ్జెట్ ఎంత ఉంటుందో?

కేవలం ఈ ముగ్గురి రెమ్యూరేషన్ రూపంలోనే రూ. 65 కోట్లు ఖర్చు చేస్తే... సినిమా చిత్రీకరణ, ఇతర నటీనటులు, టెక్నీషియన్లు కలిపి మొత్తం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తారో?

 ఇంతకీ...అంత సీన్ ఉందా?

ఇంతకీ...అంత సీన్ ఉందా?

అయితే ఈ వార్తలు విన్న కొందరైతే.... ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా అంటే నమ్మశక్యంగా లేదని.... కేవలం కాంబినేషన్ క్రేజ్ తో టాలీవుడ్లో ఇంత రెమ్యూనరేషన్, ఇంత బడ్జెట్ పెట్టేంత సీన్ లేదని అంటున్నారు.

 క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది

క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది

అయితే చిరు, పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా గురించి జరుగుతున్న ప్రచారం విషయంలో అభిమానులు అయోమయానికి గురి కాకుండా ఓ క్లారిటీ ఇస్తే బావుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

English summary
Film Nagar source said that, Chiranjeevi and Pawan Kalyan's biggest multi-starrer is on cards and it's said that Trivikram would direct this crazy combination.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu