చిరు, పవన్ అండ.... బాహుబలి తాతను తీస్తానంటూ గొప్పలు?

చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓకే కావడంతో సుబ్బిరామిరెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషంలోనే ఇలా గొప్పలకు పోతున్నారని టాక్.

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు గొప్ప సినిమా, భారీ విజయం, భారీ వసూళ్లు సాధించిన సినిమా ఏది అంటే..... అందరూ ముందుగా చెప్పేది బాహుబలి సిరీస్ సినిమాల గురించే. అయితే త్వరలో తాను బాహుబలిని మించే బాహుబలి తాత లాంటి సినిమా చేస్తానంటూ ఓ సినీ ప్రముఖుడు గొప్పలు చెప్పుకుంటున్నాడట.

ఆ ప్రముఖుడు మరెవరో కాదు... కళాబంధు, ప్రముఖ రాజకీయవేత్త, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి అంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓకే కావడంతో సుబ్బిరామిరెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషంలోనే ఇలా గొప్పలకు పోతున్నారని టాక్.

అంచనాలు భారీగానే కానీ ఇప్పుడు అవసరమా?

అంచనాలు భారీగానే కానీ ఇప్పుడు అవసరమా?

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్లాయి. అంతా బాగానే ఉంది కానీ... ఆది లోనే ఇంతలా గొప్పలకు పోవడం అవసరమా? అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇంకా సిద్ధం కాని కథ...

ఇంకా సిద్ధం కాని కథ...

ఈ సినిమా ప్రాజెక్టు ప్రస్తుతానికైతే ప్రతిపాదనల దశలోనే ఉంది. ఇంకా కథ కూడా సిద్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ సిద్ధం చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టు పూర్తి క్లారిటీ రాబోతోంది.

సుబ్బిరామిరెడ్డి

సుబ్బిరామిరెడ్డి

ప్రస్తుతం ఓ సినిమాకు కలిసి పని చేస్తున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్లను టి. సుబ్బరామిరెడ్డి షూటింగ్ స్పాటుకు వెళ్లి కలిసారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ ను సిద్ధం చే స్తున్నట్లు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,సుబ్బరామిరెడ్డిలకు చెప్పినట్లు తెలుస్తోంది.

కేవలం త్రివిక్రమ్ కే ఇది సాధ్యం

కేవలం త్రివిక్రమ్ కే ఇది సాధ్యం

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల ఇమేజ్ లకు ధీటైన, ఉన్నతమైన కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రిని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒక్క‌రే డైరెక్ట్ చేయ‌గ‌ల‌ర‌నేది నా న‌మ్మ‌కం అని సుబ్బిరామిరెడ్డి అన్నారు.

త్వరలో వైభవంగా ప్రారంభిస్తాను

త్వరలో వైభవంగా ప్రారంభిస్తాను

చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు ప్రస్తుతం వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరి కమిట్మెంట్స్ పూర్తవగానే ఈ చిత్రాన్ని వైభవంగా ప్రారంభిస్తాము. అశ్వ‌నీద‌త్ తో క‌లిసి ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ ఈ సినిమాను నిర్మిస్తాను అని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X