చిరంజీవి పార్టీకి సమయం ఆసన్నమైందా???
స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు వంగవీటి రాధకృష్ణ టాక్ ఆఫ్ ద స్టేట్ అయ్యాడు. దేవినేని రాజశేఖర్ భూముల వ్యవహారమై తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన రాధాకృష్ణ మరుసటి రోజే సినిమా హీరో పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు తెలిసింది. రాధా రాజీనామా విషయమై ముఖ్యమంత్రి సముదాయించినా వెనక్కు తగ్గే సమస్యేలేదని రాధాకృష్ణ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారాన్నంతా చూస్తుంటే చిరంజీవి పార్టీ పెట్టే అవకాశాలు అవగతమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సి.ఎమ్.పి.ఎఫ్) ప్రారంభించిన రోజు కూడా రాధాకృష్ణ పవన్ తో ఉన్నాడు. రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయం విషయంలో జరుగుతున్న ప్రయత్నాలు రాధా వ్యవహారంతో ముమ్మరమైనట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications